ELON MUSK TWEETS THEN DELETES MEME COMPARING JUSTIN TRUDEAU TO ADOLF HITLER PVN
Canada Vaccine Protest : కెనడా ప్రధానిని హిట్లర్ తో పోల్చిన ఎలన్ మస్క్
హిటర్లతో ట్రూడోని పోల్చిన మస్క్
Elon Musk comparing canada PM to Adolf Hitler : కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు ట్రుడో ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు ఆందోళన బాటపడ్డారు. అమెరికా-కెనడా సరహద్దుల వద్ద పెద్దఎత్తున ట్రక్కులను నిలిపి ఆందోళన చేస్తున్నారు
Elon Musk comparing Justin Trudeau to Adolf Hitler : కెనడా ప్రధాని ప్రధాని జస్టిన్ ట్రుడోని..జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. కెనడాలో వ్యాక్సిన్ తప్పనిసరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు మద్దతు ప్రకటించిన ఎలన్ మస్క్.. ట్రుడోను అభినవ హిట్లర్‌గా పేర్కొంటూ బుధవారం రాత్రి ట్వీట్ చేశాడు. అయితే దీనిపై దుమారం రేగడంతో ఎలాంటి వివరణ ఇవ్వకండానే గురువారం మధ్యాహ్నం ఆ ట్వీట్ ను ఎలన్ మస్క్ తొలగించాడు
కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు ట్రుడో ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు ఆందోళన బాటపడ్డారు. అమెరికా-కెనడా సరహద్దుల వద్ద పెద్దఎత్తున ట్రక్కులను నిలిపి ఆందోళన చేస్తున్నారు. వారికి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గత నెలలోనే మద్దతు తెలిపారు. వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలంటూ డ్రైవర్లు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. అమెరికా కెనడా సరిహద్దులను ట్రక్కర్లు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారులు, బ్రిడ్జిలపై ట్రక్కులను అడ్డంగా పెట్టడంతో దేశం స్తంభించిపోయింది. డ్రైవర్లు తప్పనిసరిగా కోవిడ్ వాక్సిన్ వేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ఒట్టావాను ముట్టడించారు. దాంతో, ఒట్టావాలో పరిస్థితులు అదుపు తప్పాయి.
పోలీసులు సైతం చేతులెత్తేయడంతో ప్రధాని ట్రుడో కెనడా మొత్తం ఎమర్జెన్సీ విధించారు. కరోనావైరస్ మహమ్మారి పరిమితులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అంతరాయాలు, నిరసనలను ఎదుర్కొనడానికి ఫెడరల్ ప్రభుత్వానికి అదనపు అధికారాలను ఇవ్వడానికి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కెనడియన్ చరిత్రలో మొదటిసారిగా అత్యవసర పరిస్థితుల చట్టాన్ని అమలు చేశారు. ట్రక్కు డ్రైవర్లు శాంతించాలని, నిరసనకారులందరినీ ఇంటికి వెళ్లాలని ప్రధాని జస్టిన్ ట్రూడో కోరారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై కూడా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ ప్రజలను జో బైడెన్ ఫూల్స్ మాదిరిగా చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మస్క్. బైడెన్ మనిషి రూపంలో ఉన్న తోలు బొమ్మ అని విమర్శించిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.