Elon Musk bashes Democrats: ప్రపంచ పరిణామాలపై నిత్యం స్పందించే టెస్లా(Tesla)అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk)..కొద్ది రోజులుగా అమెరికా రాజకీయాలపై తన స్వరం పెంచుతున్నారు. ఎలాన్ మస్క్.. జో బైడెన్(Joe Biden) ప్రభుత్వంపై చాలా రోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల పన్నుల విధానం విషయంలో బైడెన్ ప్రభుతాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ ట్వీట్ లో బుధవారం ఓ ట్వీట్ లో అమెరికా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలకెక్కారు. గతంలో డెమొక్రాట్లకు ఓటేశానని చెప్పిన ఎలాన్ మస్క్.. ఇకపై వారికి తన మద్దతు ఇవ్వనని తేల్చిచెప్పారు. వచ్చే అమెరికా అధ్యక్షఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కే ఓటు వేస్తానని అన్నారు. అమెరికాలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అని రెండు పార్టీలు ఉన్నాయి. డెమొక్రాట్లు అంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ. రిపబ్లికన్లు అంటే ట్రంప్ పార్టీ.
బుధవారం చేసిన ట్వీట్ లో మస్క్.."గతంలో డెమొక్రాట్లకే ఓటు వేశాను. ఎందుకంటే ఇంతకుముందు వారు సౌమ్యమైన పార్టీ వ్యక్తులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా తయారవుతోంది. అందుకే ఇక నుంచి వారికి మద్దతు ఇవ్వను. రిపబ్లికన్ పార్టీ(డొనాల్డ్ ట్రంప్)కే ఓటు వేస్తాను. ఇక ఇప్పుడు నాకు వ్యతిరేకంగా చెడు ప్రచారం ఎలా చేస్తారో చూడండి" అంటూ జో బైడెన్ పార్టీని ఉద్దేశిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. రాజకీయ పరంగా తనపై పెరుగుతున్న విమర్శలను ఉదహరించిన ఆయన రానున్న మరికొన్ని నెలల్లో తనపై రాజకీయ దాడులు మరింత పెరగుతాయని ఇటీవల మరో ట్వీట్లో పేర్కొన్నారు.
ALSO READ PM Modi : అభివృద్ధే బీజేపీకి పరమావధి..వచ్చే 25 ఏళ్లు బీజేపీవే.. రోడ్ మ్యాప్‌ను రూపొందించిన మోదీ
మరోవైపు,క్యాపిటల్ హిల్ హింస ఘటన సమయంలో ట్విట్టర్ సంస్థ.. ట్రంప్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ట్విట్టర్ ట్రంప్ అకౌంట్ పై బ్యాన్ ఎత్తేయలేదు. ఇప్పుడు ట్విట్టర్ చేతులు మారిపోయింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిపోయింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధాన్ని తీసేస్తానని గత నెలలో మస్క్ తెలిపాడు. తనను శాశ్వతంగా బ్యాన్ చేసిన ట్విట్టర్‌ను టేకోవర్ చేసినందుకు అభినందనలు తెలిపారు ట్రంప్. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ చాలా మంచోడని అన్న ట్రంప్.. అయినా తన ట్రూత్ సోషల్ యాప్ (Truth Social) వదిలి ట్విట్టర్ లోకి వచ్చే ప్రసక్తే లేదన్నాడు. తమ కంపెనీ సొంతంగా రూపొందించిన ట్రుథ్ సోషల్ (Truth Social)లోనే ఉంటానని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, Elon Musk, Joe Biden, Tesla Motors, USA