హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Elon Musk-Twitter Deal : ట్విట్టర్ కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్..44 బిలియన్ డాలర్ల డీల్ రద్దు

Elon Musk-Twitter Deal : ట్విట్టర్ కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్..44 బిలియన్ డాలర్ల డీల్ రద్దు

ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్

Elon Musk Cancelled Twitter Deal : ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గారు. అందరూ ఊహించినట్లుగానే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Elon Musk Cancelled Twitter Deal : ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్(Twitter) కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గారు. అందరూ ఊహించినట్లుగానే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించారు. ఎంతో ఇష్టపడి ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన మస్క్... విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని పేర్కొంటూ 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుంచి వెనక్కి తగ్గినట్టు తెలిపారు. స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌పై పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒప్పంద నిబంధనలు ఉల్లంగించారని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతుగున్న‌ట్లు మ‌స్క్ తెలిపారు. అయితే మ‌స్క్ నిర్ణ‌యంపై ట్విట్ట‌ర్ స్పందించింది. మస్క్ యూటర్న్‌ను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్...న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపింది. మ‌స్క్ అంగీక‌రించిన ధ‌ర‌కు, ష‌ర‌తుల‌కు లోబ‌డే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేల‌ర్ తెలిపారు. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు.

  కాగా,ట్విట్టర్​పై దాదాపు ఏడాది కాలంగా ఎలాన్ మస్క్​ తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు ట్విట్టర్​లో అవకాశాలు ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో... ట్విట్టర్​లో దాదాపు 9శాతం వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ట్విట్టర్ మొత్తాన్ని​ కొనుగోలు చేసేందుకు ఆఫర్​ ఇచ్చారు. ఎలాన్​ మస్క్​ -ట్విట్టర్​ మధ్య 44బిలియన్​ డాలర్ల డీల్​ కుదిరింది. ట్విట్ట‌ర్‌ను కొనేందుకు ఏప్రిల్‌లో ఓకే చెప్పినా,..మే నెల‌లో ఆ డీల్‌పై మ‌స్క్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఫేక్ అకౌంట్స్ వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ దుర్వినియోగానికి గురవుతుందని ఆయన భావించారు. ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్ ఖాతాలను తక్కువగా చూపుతోందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ ఆటోమేటెడ్ ఖాతాలు, తప్పుడు సమాచారం, మోసాలు జరిగేందుకు ఆజ్యం పోస్తున్నాయని మస్క్ వాపోయారు.

  Murder case : నెల రోజుల క్రితం పెళ్లి..రూ.50వేలు,బంగారు గొలుసు కోసం భార్యను చంపిన భర్త!

  ట్విట్టర్​ చెబుతున్న దాని కన్నా ఎక్కువ ఫేక్​ అకౌంట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని మస్క్​ పట్టుబట్టారు. మొత్తం యూజ‌ర్ల‌లో ఫేక్ లేదా స్పామ్ యూజ‌ర్లు కేవ‌లం 5 శాతం లోపు మాత్ర‌మే ఉన్నాయన్న విష‌యాన్ని నిరూపించాల‌ని, అప్పటివరకు డీల్ ముందుకు కదలదని మ‌స్క్ ట్విట్టర్ కు కండీష‌న్ పెట్టారు. అయితే ట్విట్ట‌ర్ సంస్థ ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే, ఈ మొత్తం సమస్యపై, ప్రతిరోజూ 1 మిలియన్ స్పామ్ ఖాతాలను ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేస్తున్నామని ట్విట్టర్ ఇప్పటికే తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లో ప్రమాదకరమైన ఆటోమేటెడ్ బాట్స్‌ (Bots)ను తొలగించేందుకు ట్విట్టర్ నిరంతరం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ కొనుగోలు డీల్ కి మస్క్ గుడ్ బై చెప్పారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Elon Musk, Twitter

  ఉత్తమ కథలు