Twitter Working Hours : టెస్లా సీఈఓ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి ట్విట్టర్ (Twitter) వెళ్లిపోవడం ఆ సంస్థ ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా మారింది. మస్క్ ట్విట్టర్ సీఈఓతో పాటు కీలక పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను సైతం సింపుల్‌గా పీకి పారేశారు. అంతేకాదు, ఉన్న ఉద్యోగులకు కూడా ఆయన పెట్టే ఆంక్షలు బెంబేలెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మస్క్ పెట్టిన డెడ్‌లైన్స్ వల్ల మేనేజర్లు చేసేదిలేక కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లను రోజుకు 12 గంటలు, వారానికి ఏడు రోజులు పని చేయాల్సిందిగా కోరారు. ఉదయం ఫలానా సమయానికి వస్తే మళ్లీ సాయంత్రం అదే సమయానికి వెళ్ళేలా మస్క్ రూల్స్ పెట్టడంతో కొందరు ట్విట్టర్ ఉద్యోగులు బాగా అలసిపోయి శుక్ర, శనివారాల్లో ఆఫీసులోనే నిద్రపోయినట్లు తెలుస్తోంది.
"ట్విట్టర్‌లోని మేనేజర్లు మస్క్ పెట్టిన డెడ్‌లైన్స్ చేరుకునేలా కొంతమంది ఉద్యోగులను వారానికి ఏడు రోజులు, రోజుకు 12 గంటల షిఫ్టులలో పని చేయాలని ఆదేశించారు" అని CNBC రిపోర్ట్ పేర్కొంది. ట్విట్టర్ మార్పుల కోసం మస్క్ పెట్టిన ఒక నిర్దిష్ట డెడ్‌లైన్ చేరుకోవడానికే ఇలా ఎక్స్ట్రా వర్క్ చేయాలని ట్విట్టర్ ఎంప్లాయిస్ను మేనేజర్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది. స్పేస్ ఎక్స్ సీఈఓ ట్విట్టర్‌లోని పెద్ద తలకాయలను తీసేయడానికే వెనకడుగు వేయలేదు. అందుకే, తమ కొత్త బాస్ చెప్పినట్లు వర్క్ చేయకపోతే ఎక్కడ తమను కూడా ఎటువంటి హెచ్చరిక లేదా సెవెరెన్స్ ప్యాకేజీ లేకుండా తీసేస్తారేమోనని ఉద్యోగులందరూ వణికిపోతున్నారు.
Job Readiness: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 60 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో ఉద్యోగాలు పొందే అవకాశం..
"నవంబర్ ప్రారంభ గడువులోగా టాస్క్ పూర్తి చేయడం అనేది ట్విట్టర్లో ఉద్యోగుల కెరీర్ డిసైడింగ్ మ్యాటర్‌గా మారింది. ఒకవేళ వారు టాస్క్ పూర్తి చేయడంలో ఫెయిల్ అవుతే.. జాబు పోయే అవకాశం ఉంది" అని నివేదిక పేర్కొంది. ఈ ఆర్డర్‌ను పాటించమని ఉద్యోగులను బలవంతం చేయడానికి మస్క్ 50 శాతం ఉద్యోగులను తొలగిస్తానని బెదిరిస్తున్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. ఎక్స్ట్రా వర్క్ చేయించుకుంటున్నా ఓవర్‌టైమ్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ గురించి మస్క్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హమని రిపోర్టు తెలిపింది. అంతేకాదు ఉద్యోగులు తమ పనిని, వారి టీమ్ వర్క్‌ను సమర్థించుకోవాలని.. కంపెనీకి వారి విలువను వివరించాలని కూడా కోరినట్లు నివేదిక వెల్లడించింది.
మరోవైపు మస్క్ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ధరను పెంచాలని, బ్లూ టిక్ కోసం వెరిఫికేషన్ ప్రాసెస్‌ను కూడా రివైజ్ చేయాలని ప్లాన్ చేశారు. మస్క్ ట్విట్టర్ ఇంజనీర్లకు నవంబర్ 7లోగా పెయిడ్ వెరిఫికేషన్ ఫీచర్‌ను లాంచ్ చేయాలని, లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని డెడ్‌లైన్ పెట్టారు. అలానే ఇతర పనులకు కూడా గడువు పెట్టి ఉండవచ్చు. ఇక ట్విట్టర్లో బ్లూ టిక్ బ్యాడ్జ్‌ను సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లో భాగం చేసే అవకాశం ఉంది. బ్లూ సబ్స్క్రిప్షన్ పెంచే అవకాశం వార్తలు వస్తున్న వేళ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.