Home /News /international /

ELON MUSK IS DEVELOPING STARSHIP VEHICLE THAT COULD BE A GAME CHANGER FOR SPACE TRAVEL HERE IS INTERESTING DETAILS GH SK

Starship: అంగారక గ్రహంపైకి స్పేస్ ఫ్లైట్.. ఎలాన్‌ మస్క్‌ స్టార్‌షిప్‌ గురించి మీకు తెలుసా? 

ప్రతీకాత్మక చిత్రం (Image:Elon Musk)

ప్రతీకాత్మక చిత్రం (Image:Elon Musk)

Space x Starship: అంగారక వాతావరణంలోకి రాగానే 60 డిగ్రీల యాంగిల్‌లో హారిజాంటల్‌ పొజిషన్‌లో ల్యాండ్‌ చేస్తారట. దీనిని బెల్లీ ఫ్లాప్స్‌ అని అంటారు. దీని వల్ల స్టేబుల్‌గా ల్యాండ్‌ అవుతుందనేది శాస్త్రవేత్తల ఆలోచన

అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయాలని ప్రముఖ వ్యాపారవేత్త, టెక్‌ దిగ్గజం ఎలా మస్క్‌ చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ నుండి స్టార్‌ షిప్‌ అనే భారీ రాకెట్‌ను లాంచ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పనులు, పర్మిషన్లు తీసుకుంటున్నారు.దీనిని అంతరిక్ష రంగంలో గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్నారు కూడా. ఇంతకీ ఏంటీ ప్రాజెక్టు. దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం!

స్పేస్‌ ఎక్స్‌ రూపొందిస్తున్న ఈ స్పేస్‌ ఫ్లైట్‌లో 100 మందిని అరుణ గ్రహంపైకి తీసుకెళ్లాలనేది ఎలాన్‌ మస్క్‌ ఆలోచన. అయితే ఈ ప్రయాణం, దానికి ఉపయోగించే ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ రీయూజబుల్‌గా ఉండాలనేది మస్క్‌ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ముఖ్య ఉద్దేశం అయితే ఇతర గ్రహాలకు కూడా మానవజాతిని విస్తరింపజేయడంట. అప్పుడు ఏదైనా ఉల్క వచ్చిన భూమిని తాకి... ఇక్కడి మానవాళి అస్థిత్వానికి ఇబ్బంది ఎదురైతే వేరే గ్రహాల్లో మానవాళి ఉంటుందనేది ఆయన ఉద్దేశమట. దాని వల్ల మానవ నాగరికత కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో అంగారక గ్రహంపై నగరాలను నిర్మించాలని ఆయన తరచూ చెబుతుంటారు. దీని కోసం ఆయన స్టార్‌షిక్‌ లాంటి వాహనం ఒకటి ఉండాలని నిర్ణయించుకున్నారు.

రాకెట్‌, అంతరిక్ష నౌకను కలగలిపి ఈ స్టార్‌షిప్‌ ఆలోచన చేశారు. దీని ద్వారా అంగారక గ్రహానికి వందిమందికిపైగా ప్రయాణించొచ్చు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ స్టార్‌షిప్‌ రీయూజబుల్‌. అంటే మరో ప్రయోగానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చన్న మాట. ఈ స్టార్‌షిప్‌ మొత్తం ఎత్తు 120 మీటర్లు ఉంటుంది. సూపర్‌ హెవీ అనే రాకెట్‌ ఉంటుంది. మొత్తంగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో ఆరు రాప్టర్‌ ఇంజిన్స్‌ ఉంటాయి. వీటిని స్పేస్‌ ఎక్స్‌ రూపొందించింది. ఈ రాకెట్‌ కంబషన్‌ స్టేజీల వారీగా సాగుతుంది. దాని వల్ల ప్రొపెల్లంట్‌ వేస్టేజ్‌ బాగా తగ్గుతుంది. ఇందులో లిక్విడ్‌ మిథేన్‌ (సీహెచ్‌4), లిక్విడ్‌ ఆక్సిజన్‌ (ఓ2) వాడుతున్నారు. ఈ రెండూ ఆక్సిడైజర్‌గా ఉపయోగపడతాయి. ఈ కెమికల్‌ ఇంధనం మండటానికి ఉపయోగపడతాయి.

ఇదంతా రాకెట్‌ అంతరిక్షానికి వెళ్లినప్పుడు. మరి రాకెట్‌ భూమికి తిరుగు ప్రయాణం అయినప్పుడు ఇంధనం సెల్ఫ్‌ సఫిసియెన్సీ విధానం ద్వారా అందుతుంది. దీని వల్ల ధర బాగా తగ్గుతుందట. ఈ రాకెట్‌లో వివిధ దశల్లో మొత్తంగా 28 రాప్టాన్‌ ఇంజిన్లను వినియోగిస్తారు. మొత్తంగా దీని వల్ల 72 మెగాన్యూటన్ల థ్రస్ట్‌ వెలువడుతుంది. 1960, 1970ల కాలంలో లాంచ్‌ చేసిన అపోలో మూన్‌ మిషన్లు సాట్రన్‌ వి లాంచర్‌ కంటే ఇది చాలా పవర్‌ ఫుల్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్పేస్‌ షిప్లో మార్స్‌కు వెళ్లడానికి తొమ్మిది నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇందులో మొత్తంగా 40 కేబిన్లను ఏర్పాటు చేయాలని మస్క్‌ నిర్ణయించారు. ఒక్కో కేబిన్లో ఆరుగురు వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే తొలిసారి ఇద్దరు లేదా ముగ్గురితోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నారట. దాని వల్ల మొత్తంగా వంద మందికిపైగా అందులో ప్రయాణిస్తారని ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

స్పేస్‌ షిప్‌లోని సూపర్‌ క్రాఫ్ట్‌‌ ల్యాండింగ్‌కు శాస్త్రవేత్తలు పారాచ్యూట్‌ లేదంటే రన్‌ వే ల్యాండింగ్‌ విధానాన్ని వాడనున్నారు. ఇక స్టార్‌ షిప్‌ అప్పర్‌ స్టేజ్‌ విషయానికొస్తే... అంగారక వాతావరణంలోకి రాగానే 60 డిగ్రీల యాంగిల్‌లో హారిజాంటల్‌ పొజిషన్‌లో ల్యాండ్‌ చేస్తారట. దీనిని బెల్లీ ఫ్లాప్స్‌ అని అంటారు. దీని వల్ల స్టేబుల్‌గా ల్యాండ్‌ అవుతుందనేది శాస్త్రవేత్తల ఆలోచన. దీని కోసం పైన, దిగువన స్టీల్‌ ల్యాండింగ్‌ ఫ్లాప్స్‌ వాడుతున్నారు. ఈ విధానం స్కైడైవర్‌ను పోలి ఉంటుంది. దీని కోసం వాహనం భూమికి చేరువగా వచ్చినప్పుడు కాస్త స్లో అవుతుంది. ఆ తర్వాత లోపల ఏర్పాటు చేసిన ఇంజిన్‌ను మండిస్తారు. దాని వల్ల స్టార్‌ షిప్‌ వర్టికల్‌ పొజిషన్‌లోకి మారుతుంది. దాని వల్ల సేఫ్‌ ల్యాండింగ్‌ వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా టెక్సాస్‌లోని బోకాచికా స్పేస్‌ స్టేషన్లో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌ షిప్‌కు వివిధ ప్రోటోటైప్స్ సిద్ధం చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే స్టార్‌హోపర్‌ అనే 39 మీటర్ల టెస్ట్‌ ఆర్టికల్‌ను సిద్ధం చేశారు. ఇది ఒక విధంగా చూడటానికి వాటర్‌ టవర్‌లా కనిపిస్తుంది. తొలి ప్రోటోటైప్‌ నోస్‌ కోన్‌, ఫ్లాప్స్‌ ఉంటాయి. దీనికి ఎస్‌ఎన్‌ 8 అనే సీరియల్‌ నెంబరును కేటాయించారు కూడా. దీనిని డిసెంబరు 2020లో రూపొందించారు. 2021 జనవరిలో ఎస్‌ఎన్‌ 9 తయారు చేశారు. ఈ రెండూ తిరిగి భూమిని చేరుకునేటప్పుడు వేగంగా ల్యాండ్‌ అయ్యాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఎస్‌ఎన్‌ 10ను సిద్ధం చేశారు. అయితే అనుకోని విధంగా ఇది ప్రమాదంలో కాలిపోయింది. ప్రస్తుతం మరో ప్రోటోటైప్‌ సిద్ధమవుతోంది.

2023 నాటికి లూనార్‌ ఎక్స్‌కర్షన్‌ పక్కా అని ఎలా
Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, Elon Musk, Space, Us news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు