Home /News /international /

ELON MUSK FRESH CHALLENGE FOR PUTIN SAYS PUTIN CAN BRING HIS BEAR FOR A FIGHT PVN

Elon Musk-Putin : పుతిన్ కు ఎలాన్ మస్క్ మరో సవాల్

పుతిన్-ఎలాన్ మస్క్

పుతిన్-ఎలాన్ మస్క్

Elon Musk-Putin Fight :ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సవాల్ విసిరారు. దమ్ముంటే పుతిన్ ​ ఫేస్‌ టు ఫేస్‌ పోరులో తనతో తలపడాలని..ఈ పోరులో గెలిచిన వాళ్లే ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగాలా ఆగిపోవాలా అన్నది నిర్ణయిస్తారు అంటూ సోమవారం ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
Elon Musk fresh challenge for Putin : ఉక్రెయిన్​ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై మూడు వారాలుగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తొలుత సైనిక స్థావరాలు, ఆర్మీనే టార్గెట్ అని చెప్పిన రష్యా.. క్రమంగా ఆఫీసులు, అపార్ట్ ​మెంట్ బిల్డింగ్ లను ను సైతం టార్గెట్ చేస్తోంది. ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సవాల్ విసిరారు. దమ్ముంటే పుతిన్ ​ ఫేస్‌ టు ఫేస్‌ పోరులో తనతో తలపడాలని..ఈ పోరులో గెలిచిన వాళ్లే ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగాలా ఆగిపోవాలా అన్నది నిర్ణయిస్తారు అంటూ సోమవారం ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పుతిన్ కు మరోసారి సవాల్ విసిరారు ఎలాన్ మస్క్. పుతిన్​ గాని తనతో తలపడ దలుచుకుంటే ఆయనకు ఉన్న సొంత ఎలుగుబంటిని తెచ్చుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ట్వీట్ చేశారు.

ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఛాలెంజ్ కు రష్యా కూడా గట్టిగానే స్పందించింది. ఎలాన్ మస్క్ సవాల్ పై రష్యా స్పేస్‌ ఏజెన్సీ చీఫ్‌ దిమిత్రి రొగోజిన్‌ స్పందిస్తూ.."నువ్వు ఒక చిన్న దెయ్యం. ఇంకా యంగ్‌ అనుకుంటున్నావా ? బలహీనుడా.. నాతో పోటీ పడు. అది కూడా సయమం వృథానే. ముందు నా తమ్ముడిపైన గెలిచి చూపించు"అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ కూడా దీటుగానే బదులిచ్చారు. పుతిన్‌ ఓ ఎలుగుబంటిపై రైడ్‌ చేస్తోన్న ఫొటో పక్కన తాను మంటలు రువ్వుతున్న ఫొటోను జతచేసి మస్క్‌ ఓ పోస్ట్ చేశారు. పుతిన్‌ ఆయనతో పాటు ఎలుగుబంటిని కూడా పోరాటానికి తీసుకురావొచ్చు అనే అర్థం వచ్చేలా మరోసారి రష్యా అధ్యక్షుడికి సవాల్‌ విసిరారు.

ALSO READ Eiffel Tower : అవును,నిజమే..ఈఫిల్ టవర్ ఎత్తు 6 మీటర్లు పెరిగింది

కాగా, రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌ కు ఇప్పటికే స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ డిజిటల్‌ ట్రాన్సఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌.. స్టార్‌ లింక్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని మస్క్‌ కు విజ్ఞప్తి చేసిన గంటల్లోనే ఆయన చర్యలు చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Elon Musk, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు