ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఎలాన్ మస్క్ (Elon Musk) భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన తీసుకున్న నిర్ణయాలతో విసుగు చెందిన చాలా మంది ఉద్యోగులు కంపెనీని విడిచి పెట్టారు. ట్విట్టర్లో(Twitter) ఏం జరుగుతుంతో అర్థం కాని పరిస్థితుల్లో.. మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌పై అమెరికా(America) ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం మస్క్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్కు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల ప్రైవేట్ డేటాకు యాక్సెస్ ఉందా? లేదా? అనే అంశాలను యూఎస్ గవర్నమెంట్ పరిశీలిస్తోంది.
* మస్క్ ఫారెన్ రిలేషన్స్‌పై ఆందోళన
ట్విట్టర్ కంపెనీలో వాటాలు ఉన్న ప్రపంచ పెట్టుబడిదారులతో మస్క్, ప్రైవేట్ ఒప్పందాల గురించి యూఎస్ గవర్నమెంట్ వివరాలు కోరుతోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ట్విట్టర్ పెట్టుబడిదారులలో సౌదీ అరేబియా ప్రిన్స్ అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉన్నాయి. ఉక్రెయిన్ , చైనా రెండింటిలో మస్క్ వ్యాపార వ్యవహారాలు ఇప్పటికే ప్రభుత్వ శ్రేణుల దృష్టిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్కు వినియోగదారుల ప్రైవేట్ డేటా యాక్సెస్ చేసే అవకాశం ఉందా? లేదా? అని యూఎస్ గవర్నమెంట్ పరిశీలిస్తోంది. ఎలాన్ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు పరిశీలించదగినవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
* కస్టమర్ ప్రొటెక్షన్ లా ఉల్లంఘణ?
ట్విట్టర్లో సౌదీ అరేబియా వాటాను పరిశీలించాలని యూఎస్‌లోని కమిటీ ఇన్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్(CFIUS)కి పిలుపునిచ్చారు సెనేటర్ క్రిస్ మర్ఫీ (డెమొక్రాట్-కనెక్టికట్). ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC) చైర్పర్సన్ లీనా ఖాన్‌కు రాసిన లేఖలో.. యూఎస్ సెనేటర్లు మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ కస్టమర్ ప్రొటెక్షన్ లా ఉల్లంఘించిందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. ట్విట్టర్ వినియోగదారుల భద్రతను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గురించి ప్రశ్నించారు. కస్టమర్ ప్రొటెక్షన్ లా ఉల్లంఘనలపై FTC పరిశీలించాలని సూచించారు.
ఇటీవల ట్విట్టర్ కొత్త సీఈవో మస్క్ ప్లాట్‌ఫారమ్ సమగ్రత, భద్రతను దెబ్బతీసే భయంకరమైన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మోసం, స్కామ్‌లు, ప్రమాదకరమైన వంచన కోసం ఆ మార్పులు దుర్వినియోగం చేయవచ్చనే హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కొన్ని ఫీచర్లను ప్రకటించారని తెలిపారు.
Saudi Arabia: 10 రోజుల్లో 12 మంది తలలు నరికివేత..రహస్యంగా మరణ శిక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..44 మంది దుర్మరణం..వందల మందికి గాయాలు
* కీలక సిబ్బంది రాజీనామా
మస్క్ మొదట 4,800 మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు, 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. గత వారం 1,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. పెరుగుతున్న వ్యయాలను తగ్గించడంలో భాగంగా ట్విట్టర్ అధికారులు కీలక సిబ్బందిని తొలగించారు. ఇంటర్నల్ ప్రైవసీ రివ్యూలను తగ్గించారు. కొత్త మార్పులకు చట్టపరమైన బాధ్యత వహించాల్సిందిగా ఇంజనీర్లను బలవంతం చేశారు. ప్లాట్‌ఫారమ్ ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటెగ్రిటీకి బాధ్యత వహించే కీలకమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. ఈ సమయంలో కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నప్పుడు యూజర్ల పర్సనల్ డేటా దుర్వినియోగం లేదా ఉల్లంఘన బారిన పడుతుందా? లేదా? పరిశీలించే యంత్రాంగం కరవైందని సెనేటర్లు FTCకి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.