ELON MUSK EARNS NEW FANS AFTER HE REPLIES TO UKRAINE MINISTER PROVIDES STARLINK SERVICE PVN
Elon Musk : యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ పెద్ద సాయం
ఉక్రెయిన్ కి ఎలాన్ మస్క్ సాయం(ఫైల్ ఫొటో)
Elon Musk Provides Starlink Service to Ukraine : ఉక్రెయిన్ లోని రెండో పెద్ద నగరం ఖార్కివ్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలగాలపై సైనికులతో పాటు స్థానిక ప్రజలు తిరగబడ్డారు. దీంతో ఖార్కివ్ లో వీధి పోరాటాలు మొదలయ్యాయి.
Elon Musk Help To Ukraine : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా తలపెట్టిన యుద్దం రోజురోజుకూ తీవ్రతరం అవుతంది. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపిస్తూ, వాటిని వశం చేసుకున్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్ లోని రెండో పెద్ద నగరం ఖార్కివ్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలగాలపై సైనికులతో పాటు స్థానిక ప్రజలు తిరగబడ్డారు. దీంతో ఖార్కివ్ లో వీధి పోరాటాలు మొదలయ్యాయి. కార్కివ్ నగరంలోని గ్యాస్‌పైప్ లైన్ ను రష్యా సైనికులు పేల్చేశారు. ఇక, ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. కీవ్ లోకి ప్రవేశించకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
అయితే రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేయడం ఎంతో కీలకం. ఇప్పుడు ఆన్ లైన్ సేవలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోలేక ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో రష్యాతో వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ ను బాసటగా నిలిచారు టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్. స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని ఉక్రెయిన్ కు మస్క్ హామీ ఇచ్చారు.
కాగా, స్టార్ లింక్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలోఫెదొరోవ్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మస్క్ స్పందించి స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించారు. "మీరు అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలని చూస్తున్నారు. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తోంది. మీ రాకెట్లు అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపై దిగుతున్నాయి. ఇక్కడ రష్యన్ రాకెట్లు ఉక్రెయిన్ పౌరులపై దాడి చేస్తున్నాయి ఉక్రెయిన్ కు స్టార్‌లింక్ సేవల్ని అందించాలని కోరుతున్నాం" అంటూ ఫెదొరోవ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. సరిగ్గా పది గంటల్లో ఎలాన్ మస్క్ ఆ దిశగా చర్యలు చేపట్టడం విశేషం. ఉక్రెయిన్ లో స్టార్ లింక్ సర్వీస్ యాక్టివ్ అయిందని,మరిన్ని టర్మినళ్లను ప్రారంభిస్తామని మస్క్ ట్వీట్ చేశారు. యుద్ధ సమయంలో ఎలాన్ మస్క్ తనవంతుగా ఉక్రెనియన్లకు సాయంగా నిలవడంపై సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ప్రపంచ నలుమూలలకు ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ నెట్వర్క్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ దిగువ కక్ష్యలో భారీ ఎత్తున కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే 2000 శాటిలైట్లను కక్ష్యలో నిలిపారు. శుక్రవారమే 50 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు కూడా. ఉక్రెనియన్లు ఇప్పుడు స్టార్ లింక్ సర్వీస్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సిస్టమ్ ను కలిగి ఉంటారని,ఫారిన్ డేటా సెంటర్లపై సైబర్ దాడులకు పాల్పడితే తప్ప రష్యా..ఉక్రెయిన్ ఇంటర్నెట్ వ్యవస్థను పూర్తిగా తొలగించలేదని స్టార్ లింక్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ యూజర్ చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.