Home /News /international /

ELON MUSK DONATED 6 BILLION DOLLERS IN SHARES LAST YEAR DAYS AFTER TWEET ABOUT ENDING WORLD HUNGER PVN

Tesla CEO : పేదల ఆకలి తీర్చేందుకు..రూ45 వేల కోట్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ (ఫైల్ ఫొటో)

ఎలాన్ మస్క్ (ఫైల్ ఫొటో)

Elon Musk Donated 6 Billion : ప్రముఖ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రపంచదేశాల్లోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు బిలియనీర్లు ముందుకు రావాలని

Elon Musk Donated 6 Billion : ప్రముఖ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రపంచదేశాల్లోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు బిలియనీర్లు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు రూ. 43 వేల కోట్లు విలువైన టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన ఫైలింగ్‌లో తెలిపారు. గ‌తేడాది నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 50 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు చూపారు.

కాగా,ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ చరిత్రలో నిలవనున్నారు. ఆయన ఇచ్చిన విరాళం అతి పెద్ద విరాళంగా నిలవనుంది. అయితే ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి విరాళం ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారనే విషయం ఇంకా తెలియదు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్‌లో స‌మ‌ర్పించిన ఫైలింగ్‌లోనూ మ‌స్క్ ఆ వివ‌రాలు వెల్లడించ‌లేదు.

ALSO READ Huawei : చైనా కంపెనీ హువావేకి ఐటీ బిగ్ షాక్..వరుసగా రెండో రోజు కూడా

బిలియ‌నీర్లు త‌లుచుకుంటే కోట్ల మంది నిరుపేద‌ల ఆక‌లి తీర్చొచ్చని ఐక్యరాజ్య సమితి వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డైరెక్టర్ డేవిడ్ బేస్లే కొన్ని నెలల క్రితం కామెంట్‌ చేశారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు-సుమారు రూ.45,000 కోట్లు అవసరమని ట్వీట్​ చేశారు. ఐరాస ఆహార ఏజెన్సీ చేసిన ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ అప్పుడే స్పందించారు. పేదల ఆకలి సమస్య తీర్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి, ఫండ్స్‌ ను ఎలా ఖర్చు చేస్తారో చెప్తే తాను ఇప్పటికిప్పుడే తన షేర్లను విక్రయించి విరాళంగా ఇస్తానన్నారు. అలా తాను గతంలో ఇచ్చిన మాట మేరకు ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు చేసి చూపించాడు. త‌న కంపెనీ షేర్లను విరాళంగా అంద‌జేశారు. దీంతో ఎలన్‌ మస్క్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మాట నిలబెట్టుకున్నారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Elon Musk, POOR HUTS, Tesla Motors, United Nations

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు