Elon Musk : ట్విట్టర్ సీఈవో(Twitter CEO) పదవి నుంచి ఎలాన్ మస్క్(Elon Musk) దిగిపోతున్నారా? ప్రస్తుత పరిమాణాలను చూస్తే అదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ రెండు నెలల కంటే తక్కువ కాలమే సీఈవోగా ఉన్నట్లు అవుతుంది. ఎలాన్ మస్క్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా? వద్దా? అనే అంశంపై పోల్ నిర్వహించారు. ఈ పోల్ ఇంకా కొనసాగుతోంది. పోల్‌లో వచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మస్క్ చెప్పడం గమనార్హం. పోల్ నిర్వహించడం వెనుకగల కారణాలు, ఫలితాలపై ఇప్పుడు తెలుసుకుందాం.
58 శాతం ‘అవును’ అని ఓటేశారు
ట్విట్టర్ వేదికగా ఆను సీఈవో పదవిలో ఉండాలా? వద్దా? అని మస్క్ ప్రజల అభిప్రాయాలను కోరారు. పోల్‌లో ఎలాంటి ఫలితం వచ్చినా కట్టుబడి ఉంటానని మస్క్ ప్రకటించారు. ఈ పోల్‌లో ఆదివారం సాయంత్రం నాటికి అవును అని 58% మంది వద్దు అని 42% శాతం మంది తమ స్పందన తెలియజేశారు. అయితే పోల్ గడువు ఎప్పుడు ముగుస్తుందో మస్క్ తెలియజేయలేదు. పోల్ ముగిసే సమయానికి ఓట్ల శాతం మారే అవకాశం లేకపోలేదు.
మస్క్ ఇతర కమిట్‌మెంట్స్
ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సహా ఐదు కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. వాల్యుయేషన్ పరంగా అతిపెద్దది టెస్లా(Tesla) కంపెనీ. ఈ కంపెనీ పెట్టుబడిదారులు ట్విట్టర్‌లో మస్క్ మితిమీరిన ప్రమేయంతో ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబరు ప్రారంభంలో మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టెస్లా షేర్లు విలువ తగ్గుతోంది. యూఎస్ బేస్డ్ ఇతర ఆటోమేకర్‌లు రాణిస్తున్నా.. టెస్లా పనితీరు అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి.. ఖర్గేకు బీజేపీ డిమాండ్
ట్విట్టర్‌లో మస్క్ ఇతర స్థానాలు
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కొద్ది రోజులకే మొత్తం డైరెక్టర్ల బోర్డును తొలగించారు. దీంతో ఆయనే కంపెనీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకొన్నా.. కంపెనీలో మస్క్ హవా కొనసాగుతుంది.
పదవీవిరమణ చేస్తానని మస్క్ సూచించడం ఇదే మొదటిసారి కాదు
ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా.. మస్క్ టెస్లా పెట్టుబడిదారులకు తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలని అనుకోలేదని, కంపెనీ వ్యవహారాలను చక్కబడిన తర్వాత బాధ్యతలు మరొకరికి అప్పగిస్తానని వివరణ ఇచ్చారు. అయితే ఇది ఎప్పటికి జరుగుతుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ టెస్లా పెట్టుబడిదారులు మస్క్ హామీలతో సంతృప్తి చెందడం లేదు. టెస్లా అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకరైన కోగ్వాన్ లియో గత వారం టెస్లా CEO పదవి నుంచి తప్పుకోవాలని మస్క్‌ను కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.