Elon Musk Challange To Putin : ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం నేటికి 20వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను సంధిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను రష్యాలోనే పుతిన్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దురాక్రమణకు ముగింపు పలకాలని డిమాండ్ లు వనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరులో తనతో తలపడాలంటూ పుతిన్ కు సవాలు విసిరారు. ఈ పోరులో గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్ లో వాటా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
పుతిన్‌కు సవాల్ విసురుతూ ఎలన్ మస్క్ చేసిన ఈ ట్విట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు వీపరీతంగా లైకులు, షేర్లు వస్తున్నాయి. పుతిన్‌కు ట్విటర్ అకౌంట్ లేదు. దీంతో రష్యా ప్రభుత్వం అధికార ట్విట్టర్ ఖాతా @KremlinRusia_E ని మస్క్ ట్యాగ్ చేశారు. త్వరగా బదులు ఇవ్వాలంటూ పోస్ట్ చేశారు.
I hereby challenge
— Elon Musk (@elonmusk) March 14, 2022
Владимир Путин
to single combat
Stakes are Україна
కాగా, రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ కు ఇప్పటికే స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్.. స్టార్ లింక్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని మస్క్ కు విజ్ఞప్తి చేసిన గంటల్లోనే ఆయన చర్యలు చేపట్టారు.
ALSO READ Russia-Ukraine War: వైట్ ఫాస్పరస్ బాంబులతో రష్యా దాడి..? ఆరోపిస్తున్న ఉక్రెయిన్.. అసలేంటి ఈ బాంబు..?
ఇక,ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో రష్యా.. చైనా నుండి సైనిక సహాయం కోరింది. చైనా నుండి మిలిటరీకి చెందిన అల్వా డ్రోన్ సహాయం కూడా రష్యా కోరిందని యుఎస్ సీనియర్ సైనిక అధికారి ఒకరు పేర్కొన్నారు. రష్యా చైనాను సైనిక సహాయంతో పాటు ఆర్థిక సహాయం కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ తమ నివేదికలలో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.