Elon Musk: టెస్లా (Tesla) సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ (Twitter) సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో భారీగా లేఆఫ్స్ జరిగాయి. సగానికి పైగా సిబ్బందిని తొలగించిన మస్క్ మరో లేటెస్ట్ రౌండ్లో 4,400 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్క్ ఒక ఉద్యోగిని తొలగించిన తీరు చర్చనీయాంశమైంది. మస్క్ తాజాగా ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ (Android developer) టీమ్‌లోని ఒక సభ్యుడిని ఒక ట్వీట్ ద్వారా తొలగించారు. కొన్ని దేశాల్లో ట్విట్టర్ చాలా స్లోగా నడుస్తుందని మస్క్ నవంబర్ 13న ఒక ట్వీట్ చేశారు. దీనిని కోట్ చేస్తూ 'ఇది తప్పు' అని ఎరిక్ ఫ్రోన్‌హోఫర్ అనే ఆండ్రాయిడ్ డెవలపర్ పేర్కొన్నారు. ఆ తర్వాత మరొక యూజర్ ఎరిక్‌కి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి స్పందిస్తూ ఎరిక్ ఒక మాట అన్నారు. ఆ మాట చూసి మస్క్ ఎరిక్‌ని తన కంపెనీ నుంచి పీకేశారు.
Free Countries : ఈ 9 దేశాలకు వెళ్తే.. డబ్బులిచ్చి మరీ స్వాగతిస్తారు.. వెళ్తారా
‘చాలా దేశాల్లో ట్విట్టర్ స్లో అయినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. హోమ్ టైమ్‌లైన్ (sic) రెండర్ కోసం వెయ్యికంటే ఎక్కువ పూర్లీ బ్యాచ్డ్ RPCలను (Remote Procedure Call) యాప్ చేస్తోంది.’ అని మస్క్ పోస్ట్ చేశారు. RPC అనేది డిస్ట్రిబ్యూటెడ్, క్లైంట్ సర్వర్ బోస్డ్ అప్లికేషన్స్ కన్స్ట్రక్షన్ కోసం వాడే పవర్ఫుల్ టెక్నిక్. దానికి రిప్లై ఇస్తూ ‘నేను ట్విట్టర్లో దాదాపు 6 ఏళ్లుగా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ విభాగంలో పని చేస్తున్నాను. మస్క్ చెప్పింది తప్పు అని చెప్పగలను’ అని ఎరిక్ కోట్ ట్వీట్ చేశారు. దీన్ని చదివిన మస్క్.. ‘అయితే కరెక్ట్ నంబర్ ఏంటో చెప్పు. ట్విట్టర్ ఆండ్రాయిడ్ చాలా స్లోగా ఉంది. దాన్ని ఫిక్స్ చేయడానికి నువ్వేం చేశావు?’ అని అడిగారు.
Village for Sale : అమ్మకానికి గ్రామం.. విలువ రూ.2 కోట్లు.. కొనేస్తారా
ఈ క్రమంలోనే ఒక యూజర్ ఎరిక్ ట్విట్‌కు రిప్లై ఇస్తూ ‘నేను 20 ఏళ్లుగా డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ డొమైన్ ఎక్స్‌పర్ట్‌గా మీరు మీ బాస్‌కు ఈ విషయం గురించి ప్రైవేట్‌గా తెలియజేయాలి. అతను (మస్క్) నేర్చుకునేందుకు, సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పబ్లిక్‌గా అతనికి కోపం తెప్పించేలా మాట్లాడకూడదు. బహిరంగంగా అతనిపై వేలెత్తి చూపితే మీరు ద్వేషపూరితంగా కనిపిస్తారు. అలానే కంపెనీ కోసం కాకుండా మీ కోసం మీరే పని చేస్తున్నట్లు ఉంది,’ అని అన్నారు. దీనికి ఎరిక్ ‘అతనే ప్రైవేట్‌గా ప్రశ్నలు అడగవచ్చు కదా. స్లాక్ లేదా ఈమెయిల్ని ఉపయోగించి ఉండవచ్చు కదా.’ అంటూ తానెందుకు ప్రైవేట్‌గా మెసేజ్ చేయాలన్నట్లు సమాధానమిచ్చారు.
I have spent ~6yrs working on Twitter for Android and can say this is wrong. https://t.co/sh30ZxpD0N
— Eric Frohnhoefer @ ???? (@EricFrohnhoefer) November 13, 2022
ఈ ట్వీట్స్ చదివిన మస్క్ ఎరిక్‌ను ఉద్యోగం నుంచి తీసేసినట్లు 'హీ ఇజ్ ఫైర్డ్' అని ఒక రిప్లై ఇచ్చారు.
He’s fired
— Elon Musk (@elonmusk) November 14, 2022
అలా ఎరిక్ ఊహించని రీతిలో ఉద్యోగం కోల్పోయారు. తనని తొలగించినట్లు అధికారికంగా ఒక ట్వీట్ ద్వారా కూడా ఎరిక్ వెల్లడించారు. అయితే బాస్‌తో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతే ఉద్యోగాలు ఇంతే ఊడిపోతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాస్‌ను బహిరంగంగా తప్పును వేలెత్తి చూపడం.. క్వశ్చన్లు ప్రైవేట్‌గా అడగాలని నెటిజన్లు చెప్పడమే అతని ఉద్యోగం ఊడటానికి కారణం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. బాస్‌ని గౌరవించని బిహేవియర్ ఉన్న ఇతగాడిని మరొకరు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారా? అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, International news, Technology, Twitter