పిల్లిని కాపాడిన పెద్దాయన... నెటిజన్ల ప్రశంసలు...

ఆ పిల్లి... ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాక... సతమతమవుతుంటే... దాన్ని కాపాడిన విధానం అందరికీ నచ్చింది.

news18-telugu
Updated: January 4, 2020, 12:51 PM IST
పిల్లిని కాపాడిన పెద్దాయన... నెటిజన్ల ప్రశంసలు...
పిల్లిని కాపాడిన పెద్దాయన... నెటిజన్ల ప్రశంసలు... (credit : Facebook)
  • Share this:
పెంపుడు పిల్లులు మనతో బాగా కలిసిపోతాయి. అదే బయటి పిల్లులైతే... మనం కనిపించగానే పారిపోతాయి. అలాంటి ఓ బయటి పిల్లి... ఓ షాపులో పైకప్పు ఎక్కి... కిందకు దిగడం రాక... నానా ఇబ్బంది పడుతూ... అరుస్తూ ఉంటే... ఆ పెద్దాయనకు ఆ పిల్లిపై జాలి కలిగింది. దాన్ని ఎలాగైనా కిందకు దింపాలనుకున్నాడు. కానీ... తనకు అందనంత ఎత్తులో ఆ పిల్లి ఉంది. పోనీ ఏ కుర్చీయో ఎక్కి దాన్ని కాపాడదామన్నా... అప్పటికీ అందనంత ఎత్తున ఉంది. అందుకే... ఓ కుర్చీని తీసుకొని.. దాన్నే పైకి ఎత్తి పట్టుకున్నాడు. అది చూసిన పిల్లి... కుర్చీపైకి దూకితే... ఎలాగొలా తప్పించుకొని పారిపోవచ్చు అనుకుంది. కొంత ప్రాణాలకు తెగించి... కుర్చీలోకి దూకింది. ఆ వెంటనే అక్కడి నుంచీ పారిపోయింది. అలీస్ డైరీ ఫేస్‌బుక్ పేజీలో ఉన్న ఈ 15 సెకండ్ల వీడియో... నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది.
View this post on Instagram

Kindness is the best form of humanity. There is still hope....Humanity survives. 🙏#happynewyear #2020goals


A post shared by Madhur Bhandarkar (@imbhandarkar) on

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ వీడియోని బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ భండార్కర్ షేర్ చేశారు. జాతీయ అవార్డ్ గెలుచుకున్న ఆయన... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి... దయ అనేది మానవత్వానికి నిదర్శనం. మానవత్వం ఇంకా బతికే ఉందని కాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌ని చాలా మంది లైక్ చేస్తున్నారు. కామెంట్లు, రీషేర్లూ కామనయ్యాయి.
Published by: Krishna Kumar N
First published: January 4, 2020, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading