నేపాల్‌ రిసార్ట్‌లో 8 మంది భారతీయులు మృతి...

కేరళకు చెందిన 15 మంది టూరిస్టులు నేపాల్‌లోని ఖాట్మండుకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామన్ అనే ఓ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లారు.

news18-telugu
Updated: January 21, 2020, 3:26 PM IST
నేపాల్‌ రిసార్ట్‌లో 8 మంది భారతీయులు మృతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేపాల్‌లో ఘోరం జరిగింది. ఓ రిసార్టులో 8 మంది భారతీయులు చనిపోయారు. కేరళకు చెందిన 15 మంది టూరిస్టులు నేపాల్‌లోని ఖాట్మండుకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామన్ అనే ఓ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శీతాకాలంలో మంచుకొండలు చూడడానికి వెళ్లారు. చుట్టూ మంచు పడుతుంటే. ఆ కొండలను చూస్తూ ఆస్వాదించాలనుకున్నారు. అయితే, ఆ 15 మంది రిసార్టును బుక్ చేసుకోగా, అందులో 8 మంది ఒకే గతిలో ఉన్నారు. వారు అందరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే హెలికాప్టర్‌లో ఖాట్మండులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శీతాకాలం, బాగా చలిగా ఉండడంతో రూమ్‌లోని టూరిస్టులు వెచ్చదనం కోసం గదిలోని గ్యాస్ హీటర్ ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో అన్ని డోర్లు, కిటికీలు మూసి ఉంచడంతో పొరపాటున గ్యాస్ లీకై వారంతా అపస్మారక స్థితికి చేరుకుని ఆ తర్వాత చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
First published: January 21, 2020, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading