హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

వస్త్ర కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది సజీవ దహనం..

వస్త్ర కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది సజీవ దహనం..

ఉత్తర ఈజిప్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర కర్మాగారంలో మంటలు అంటుకోవడంతో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పరిపాలన అధికారులు ధ్రువీకరించారు.

    ఉత్తర ఈజిప్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర కర్మాగారంలో మంటలు అంటుకోవడంతో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పరిపాలన అధికారులు ధ్రువీకరించారు. ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎల్ ఓబర్ నగరంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనంలో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ దుస్తులు కుడతారు. ఆ భవనంలో మంటలు అంటుకున్నాయి. దీంతో భవనం బయటకు పరుగులు తీశారు. గార్మెంట్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు త్వరగా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారని, 24 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. స్థానిక ఫైరింజన్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, అప్పటికే ప్రాణాలు పోయాయి. గాయపడిన వారిని, కాలిన గాయాలు అయిన వారిని, పొగతో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిన వారిని ఆంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

    కోల్ కతాలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి..

    తాజాగా కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషాదంలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ... మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా.... మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరింది. స్ట్రాండ్ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్ భవనంలో... 13వ అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు RPF జవాన్లు, ఓ కోల్‌కతా ASI ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. కోయిలఘాట్ భవనంలో... రైల్వేకి సంబంధించిన హౌస్ ఆఫీసులు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరగగానే రైల్వే అధికారులు, కోల్‌కతా సీపీ సౌమెన్ మిత్రా, ఫైర్ మంత్రి సుజిత్ బోస్, క్రైమ్ జాయింట్ సీపీ మురళీధర్ తదితరులు స్పందించారు. ప్రమాదంలో మంటలు వెంటనే ఆర్పడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భవనం చాలా ఇరుకుగా ఉంది. అగ్ని మాపక సిబ్బంది నిచ్చెనలు వేసుకొని ఎక్కే అవకాశం కూడా లేకుండాపోయింది.

    First published:

    Tags: Fire Accident