‘కైలాసం’ నుంచి పారిపోయిన నిత్యానంద... ఎక్కడికంటే...

తనను వలసవాదిగా అయినా గుర్తించాలని నిద్యానంద చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించినట్టు ఈక్వెడార్ ప్రకటించింది. దీంతో నిత్యానంద హయాతీకి వెళ్లిపోయినట్టు ఈక్వెడార్ తెలిపింది.

news18-telugu
Updated: December 6, 2019, 9:23 PM IST
‘కైలాసం’ నుంచి పారిపోయిన నిత్యానంద... ఎక్కడికంటే...
నిత్యానంద
  • Share this:
కర్ణాటకకు చెందిన ఆధ్యాత్మిక గురువు, రేప్ కేసులో నిందితుడు, దేశం వదిలి పారిపోయిన నిత్యానంద తన ‘కైలాసం’ నుంచి కూడా పారిపోయాడు. ఈ విషయాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. ఓ ద్వీపానికి ‘కైలాసం’ అని పేరు పెట్టి, దాన్ని పూర్తి హిందు దేశంగా ప్రకటించిన నిత్యానందను తాము శరణార్థిగా ఉంచేందుకు కూడా నిరాకరించినట్టు ప్రకటించింది. ‘ఈక్వెడార్ ప్రభుత్వానికి, నిద్యానందకు ఎలాంటి సంబంధం లేదు. అతడికి ఎలాంటి భూమి విక్రయించలేదు. ఇలాంటి వార్తలు తప్పు’ అని ఈక్వెడార్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తనను వలసవాదిగా అయినా గుర్తించాలని నిద్యానంద చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించినట్టు ప్రకటించింది. దీంతో నిత్యానంద హయాతీకి వెళ్లిపోయినట్టు ఈక్వెడార్ తెలిపింది.

నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి.. దాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ దేశానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. కైలాసకు సొంతంగా పాస్‌పోర్టు ఉంది. జాతీయ జెండా, జాతీయ చిహ్నాలు సైతం ఉన్నాయి.

అంతేకాదు కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు నిత్యానంద. కైలాస ప్రధానిగా 'మా'ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని వెబ్‌సైట్‌ పేర్కొంది. కైలాస.. ఈ భూమండలంపై ఉన్న గొప్ప హిందూ దేశమని నిత్యానంద వెల్లడించారు. తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని వెబ్‌సైట్లో పేర్కొన్నారు నిత్యానంద.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు