హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nobel in Economics: పాల్ మిల్గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లకు ఎకానమిక్స్‌లో నోబెల్

Nobel in Economics: పాల్ మిల్గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లకు ఎకానమిక్స్‌లో నోబెల్

ఫొటో క్రెడిట్-The Nobel Prize

ఫొటో క్రెడిట్-The Nobel Prize

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది.

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి  ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరద్దరికి ఈ పురస్కారం ప్రధానం చేయనున్నారు. "వేలం అనేది ప్రతిచోట ఉంటుంది. అది మన రోజువారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను కనిపెట్టినందుకు పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నాం"అని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.

రాబర్ట్ విల్సన్.. కామన్ వాల్యూతో వస్తువులను వేలం విధానాన్ని అభివృద్ది చేశారు. ఇక, పాల్ మిల్గ్రోమ్ వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు. కేవలం కామన్ వాల్యూ మాత్రమే కాకుండా ఒక బిడ్డర్ నుంచి మరో బిడ్డర్ మారేలా ప్రైవేటు వాల్య్సూను అనుమతించారు. ఇక, 1968 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు. ఇప్పటివరకు 51 సార్లు ఈ అవార్డును ప్రకటించగా.. 84 మంది ఈ అవార్డును అందుకున్నారు. గతేడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ, ఫ్రెంచ్ అమెరికన్ ఎస్తర్ డఫ్లో, అమెరిక్ ఆర్థిక వేత్త మైకేల్ క్రెమర్‌లకు ఈ బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసినందుకు వీరికి నోబెల్ పురస్కారం వరించింది.

First published:

Tags: Nobel Prize

ఉత్తమ కథలు