• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • EASTER VIRAL VIDEO LONDON ZOO CELEBRATES EASTER WITH MEERKATS AND MONKEYS GO ON EASTER EGG HUNT NK

Easter Viral Video: ఈస్టర్ సందర్భంగా లండన్ జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్

Easter Viral Video: ఈస్టర్ సందర్భంగా లండన్ జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్

ఈస్టర్ సందర్భంగా లండన్ జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్ (image credit - twitter)

Easter Viral Video: ఈస్టర్ పండుగ సందర్భంగా... ఎగ్ హంటింగ్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. మరి లండన్ జూలో కోతులు, మీర్కాట్స్ ఎలా ఆడాయో వీడియో చూడండి.

  • Share this:
    Easter Viral Video: ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా క్రైస్తవులు అత్యంత ఇష్టంగా జరుపుకునే ఈస్టర్ పండుగను ప్రత్యేకంగా నిర్వహించారు లండన్ జూ నిర్వాహకులు. అచ్చం కలర్స్ వేసిన కోడిగుడ్ల లాంటి ఆకారాలను పేపర్లతో తయారుచేశారు. వాటిని మీర్కాట్లు (meerkats), ఉడుత కోతులు (squirrel monkeys) ఉన్న జోన్లలో చెట్లకు తగిలించారు. అవి అచ్చం కోడిగుడ్లలాగే ఉన్నా పెద్ద సైజులో, రంగులతో ఉన్నాయి. ఎప్పుడూ లేనిది ఇలాంటి సరికొత్త ఆకారాలు కనిపించడంతో... ఉడుత కోతులు, మీర్కాట్లు తెగ ఆనందపడిపోయాయి. ఆ ఆకారాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. జూ నిర్వాహకులు... ఆ జంతువులు తినే ఆహారాన్ని ఆ ఆకారాల్లో ఉంచారు. దాంతో ఆహారం తీసుకునేందుకు అవి అన్ని ఆకారాలనూ సెర్చ్ చేశాయి.

    ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా బ్రిటన్ లోని జూలను మూసివేశారు. అయినప్పటికీ... ఈస్టర్ పండుగను ప్రత్యేకంగా జరపాలని ఇలా ప్లాన్ చేశారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.


    మొత్తం 36 ఎకరాల జూ. కొన్ని నెలలుగా మూతపడి ఉంది. ఐతే... ఏప్రిల్ 12 నుంచి ఈ జూని తిరిగి ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

    "మాకు చలి ఎక్కువ, కొన్ని నెలలుగా చలిలోనే ఉన్నాం. ఈస్టర్ వచ్చాక... వెచ్చదనం మొదలవుతుంది. అది మాకు ఆనందం కలిగిస్తుంది. అందుకే జంతువులకు ఎగ్ హంట్ నిర్వహించడం సరైన టైమ్ గా భావించాం." అని యానిమల్ మేనేజర్ ఏంజెలా ర్యాన్... ఈవెనింగ్ స్టాండర్డ్‌తో తెలిపారు. "ఉడుత కోతులు చాలా ఉత్సుకతతో ఉంటాయి. వాటికి ఈస్టర్ బాస్కెట్లలో స్నాక్స్ దాచి ఇచ్చాం. ఆ స్నాక్స్ కోసం అవి ఉబలాటపడుతూ వెతుక్కున్నాయి. ఇక మీర్కాట్లు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. అన్ని జంతువులకూ సరిపడా స్నాక్స్‌ని బాస్కెట్లలో ఉంచి ఇచ్చాం" అని ఏంజెలా తెలిపారు.


    ఇది కూడా చదవండి: Happy Easter Sunday 2021: హ్యాపీ ఈస్టర్ సండే... ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోండి

    సందర్శకులు రాకపోతే... ఏ జూ అయినా నడపడం కష్టం కదా... లండన్ జూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇదే విషయం చెప్పారు. ప్రభుత్వం ఈ కరోనా సమయంలో జూలు, పార్కుల కోసం రూ.1,014 కోట్లను కేటాయించింది. కానీ తమ జూకి కేటాయించిన డబ్బు ఏమాత్రం సరపోలేదని నిర్వాహకులు తెలిపారు. మరో వారంలో తెరుస్తారు కాబట్టి... సందర్శకుల ద్వారా మనీ వస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published: