Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన తీవ్ర భూప్రకంపనలు..

భూకంపం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని నేపాల్ అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: September 16, 2020, 8:30 AM IST
Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన తీవ్ర భూప్రకంపనలు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
నేపాల్‌ను తీవ్ర భూప్రకంపనలు వణికించాయి. రాజధాని ఖాట్మండ్‌లో బుధవారం ఉదయం 05.04 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 6 వరకు ఉన్నట్లు నేపాల్ సిస్మొలాజికల్ సెంటర్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఇతర సిస్మోలాజికల్ సెంటర్లు మాత్రం కాస్త తక్కువగా తెలిపాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) 5.4, యూరోపియన్-మెడిటేరియన్ సిస్మొలాజికల్ సెంటర్ 5.3 గా పేర్కొన్నాయి.
భూకంప కేంద్రం ఖాట్మండ్‌కు తూర్పుగా 100 కిలోమీటర్ల దూరంలో రామ్‌చేలో ఉన్నట్టు గుర్తించారు. ఇది చైనా టిబెట్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. భూకంపం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని నేపాల్ అధికారులు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 8:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading