హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Earthquake : టర్కీలో అతి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు

Earthquake : టర్కీలో అతి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు

టర్కీలో అతి భారీ భూకంపం (image credit - twitter - @GlobalNews77)

టర్కీలో అతి భారీ భూకంపం (image credit - twitter - @GlobalNews77)

Earthquake : టర్కీలో అతి భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Earthquake : అతి భారీ భూకంపం టర్కీ దేశాన్ని కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. చాలా మంది చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ చర్యలు మొదలయ్యాయి.

టర్కీతోపాటూ.. సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది.

తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. భూకంప కేంద్రం ఆగ్నేయంగా ఉన్న నర్దాగి (Nurdagi)లో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే (USGS) గుర్తించింది. నర్దాగీకి 26 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు అమెరికా సంస్థ USGS గుర్తించింది. ఈ నర్దాగి అనేది గజియాంటెప్ ప్రావిన్స్‌లోని జిల్లా, సిటీగా ఉంది. ఇది గజియాంటెప్‌కి పశ్చిమంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు గుర్తించారు.

భూకంపం దృశ్యాలు ఇక్కడ చూడండి

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

ఉత్తమ కథలు