హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Earthquake In Mayanmar : మయన్మార్ లో భారీ భూకంపం

Earthquake In Mayanmar : మయన్మార్ లో భారీ భూకంపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Earthquake : భారత సరిహద్దు దేశం మయన్మార్(Mayanmar) లో భారీ భూకంపం(Earthquake)సంభవించింది. భూకంప కేంద్రాన్ని యవాంగాన్‌కు 260 కిమీ దూరంలో గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.

  Earthquake : భారత సరిహద్దు దేశం మయన్మార్(Mayanmar) లో భారీ భూకంపం(Earthquake)సంభవించింది. ఇవాళ(జులై-3)ఉదయం 7 గంటల సమయంలొ మయన్మార్‌లోని యవాంగన్ టౌన్‌షిప్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని యవాంగాన్‌కు 260 కిమీ దూరంలో గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 10 కిమీ లోతులో భూకంపం ఏర్పడినట్లు తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

  కాగా, మయన్మార్‌లో సంభవించే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడు నుండి ఆరు వరకు ఉంటుంది. తరచుగా సంభవించే భూకంపాలు మయన్మార్‌ కు సవాలుగా మారింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మయన్మార్‌లోని ప్రధాన భూకంపాలు... మార్చి 2011లో తార్లే భూకంపం, నవంబర్ 2012లో థబెయికిన్‌ భూకంపం,ఏప్రిల్ 2016లో కలే భూకంపం, ఆగస్టు 2016లో చౌక్ భూకంపం.

  Chaturmas : 4 రాశుల వాళ్లకి వచ్చే నాలుగు నెలలు పట్టిందల్లా బంగారమే!

  ఈమ‌ధ్య‌కాలంలో త‌ర‌చుగా ప‌లుచోట్ల భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని సయే ఖోష్ గ్రామంలో గుర్తించారు. భూకంప ప్రభావంతో ఐదుగురు మరణించారని, 44 మంది గాయపడ్డారని సమాచారం. హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లో గతేడాది నవంబర్‌లో 6.4, 6.3 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు వచ్చాయి. 1990లో వచ్చిన 7.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంతో సుమారు 40 వేల మంది మరణించారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Earth quake

  ఉత్తమ కథలు