EARTHQUAKE OF 5 POINT 3 MAGNITUDE ROCKS NORTHERN PAKISTAN TREMORS IN JAMMU KASHMIR AND AROUND LOC MKS
Earthquake : పాకిస్తాన్ను వణికించిన భూకంపం.. మన జమ్మూకాశ్మీర్, LoC వెంబడీ ప్రకంపనలు
పాకిస్తాన్ లో భూకంపం
పాకిస్తాన్ లో చోటుచేసుకున్న భూకంపం భారత్ లోని జమ్మూకాశ్మీర్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్ఓసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ వాతావరణ విభాగం (పీఎండీ) ప్రకటించిన వివరాలివి..
దాయాది పాకిస్తాన్ కొత్త ఏడాది తొలి రోజే భూకంపం దెబ్బకు వణికిపోయింది. ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతంతోపాటు దాని చుట్టుపక్కల ఏరియాలు, పెషావర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్తాన్ లో చోటుచేసుకున్న భూకంపం భారత్ లోని జమ్మూకాశ్మీర్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్ఓసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ వాతావరణ విభాగం (పీఎండీ) ప్రకటించిన వివరాలివి..
ఉత్తర పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంక్వా రాష్ట్రంలో శనివారం పొద్దు పోయిన తర్వాత భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఇస్లామాబాద్ తోపాటు స్వాత్, పెషావర్, దిగువ దిర్, స్వాబి, నౌషేరా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
అఫ్గానిస్థాన్ -తజకిస్థాన్ సరిహద్దులో హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, భూ ఉపరితలానికి 216 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని పాకిస్తాన్ వాతావరణ విభాగం తెలిపింది. భూకంప కేంద్రం.. భారత్ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో మన జమ్మూకాశ్మీర్ లో పూంఛ్ జిల్లాలో స్పష్టమైన ప్రకంపనలు వచ్చాయి. ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ భూకంప ప్రభావం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పాకిస్తాన్ లో చివరిసారిగా డిసెంబర్ 8న ఆర్థిక రాజధాని కరాచీ నగరానికి సమీపంలో భూకంపం సంభవించింది. నాటి ఘటనలో భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.