భారత్‌లో గురువారం అర్దరాత్రి భూప్రకంపనలు భయాందోళనకు దారి తీశాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్(Uttarakhand) లో భూమి కంపించడంతో ఇళ్లు పగుళ్లు వచ్చాయి. జోషిమఠ్(Joshimath)పట్టణ ప్రాంతంలో భూమి కుంగిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు నిద్రహారాలు మాని జాగారం చేశారు.భూప్రకంపనల (Earthquake)తో సుమారు 500ఇళ్లకుపైగా పాక్షికంగా దెబ్బతినడం, పగుళ్లు రావడంతో మున్సిపల్ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు. ఇంటి గోడలు పగుళ్లు రావడంతో దాదాపు 60కుటుంబాలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా అధికారులు దృవీకరించారు. తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఆప్ఘనిస్తాన్(Afghanistan)లో భూకంపం అక్కడి ప్రజల్ని భయపెట్టింది. హిందూకుష్ (Hindu Kush)పర్వతశ్రేణిలో భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌కు సుమారు 75కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం తీవ్రతను నమోదు చేసింది5.9గా గుర్తించింది.
దెబ్బతిన్న ఇళ్లు ..
దేశంలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్‌లో గత కొంత కొద్ది రోజులుగా భూప్రకంపనలు, భూమి లోంచి నీళ్లు రావడం వంటి సంఘటనలతో భయాందోళనకు గురవుతున్నారు. గురువారం రాత్రి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జోషిమఠ్ పట్టణంలోని 9వార్డుల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో పదుల సంఖ్యలో ఫ్యామిలీలు ఇళ్లు కాళీ చేయి చేశారు.సుమారు 500కుపైగా ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చాయి. స్థానికంగా నెలకొన్న పరిస్తితులను మున్సిపల్ అధికారుల ద్వారా తెలుసుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, నిపుణులు కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఓ 50ఫ్యామిలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితులను పరిశీలించడానికి ఉత్తరాఖండ్ సీఎం ధామీ జోషీమఠ్‌కు వెళ్తానని ప్రకటించారు.
Uttarakhand: Rescue operations in Joshimath on as severe landslides continue, families relocated Read @ANI Story | https://t.co/cebxWaOHpi#Uttarakhand #Joshimath #Joshimathlandslide #Uttarakhandlandslide #Joshimathrescueoperation pic.twitter.com/5geL39AXdk
— ANI Digital (@ani_digital) January 5, 2023
దేశ రాజధానిలో ప్రకంపనలు..
భారత్‌లో ఉత్తరాఖండ్‌తో పాటు ఢిల్లీ హర్యానా , రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో రాత్రి 8గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. జనవరి 1వ తేదిన ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారు జామున స్వల్పంగా భూమి కంపించడం గుర్తించారు. రిక్టార్ స్కేలుపై 3.8గా తీవ్రత నమోదైనట్లుగా ఎన్సీఎస్ వెల్లడించింది.
భూకంపంతో భయం..
గురువారం రాత్రి ఆఫ్గనిస్తాన్‌లో భూమి కంపించింది. హిందూకుష్ పర్వతశ్రేణిలో ఈ విపత్తు సంభవించింది. ఫైజాబాద్‌కు 79కిలోమీటర్లదూరంలో 5.9గా భూకంప తీవ్రత నమోదైంది. జోషిమఠ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భూమి లోపల నుంచి నీరు బయటకు రావడాన్ని కూడా అధికారులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.