Turky thanks india : టర్కీకి ఆగ్నేయంగా..సిరియాకి ఉత్తరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో నిన్న గంటల గ్యాప్‌లో వచ్చిన 3 భూకంపాలు(Turkey-syria earthquakes).. ఆ రెండు దేశాలనూ అల్లకల్లోలం చేశాయి. టర్కీ, సిరియా దేశాల్లో(Turky-syria earthquake) ఇప్పటిదాకా 5వేల మందికిపైగా మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20వేల మంది వరకు మృతుల సంఖ్య ఉండొచ్చనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. భూకంపాల కారణంగా బిల్డింగ్ లు కుప్పకూలి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలను టర్కీ పంపించింది భారత ప్రభుత్వం(India send NDRF teams to turky). అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపింది భారత్. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్లాయి. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (NDRF)యొక్క రెండు బృందాలు.. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందిని కలిగి ఉండి సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్ల కోసం భూకంపం ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని PMO ఒక ప్రకటనలో తెలిపింది.అవసరమైతే మరింత సాయం అందిస్తామని ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. కాగా,భారత్ సాయంపై టర్కీ స్పందిస్తూ భారత్ కు థన్యవాదాలు తెలిపింది(Turkey thanks india). తమని ఆపదలో ఆదుకున్నందుకు భారతదేశాన్ని నిజమైన స్నేహితుడు అని టర్కీ పేర్కొంది.
టర్కీకి భారతదేశం ఇస్తున్న మద్దతు గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని వివరిస్తూ భారతదేశానికి చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో సునేల్ ..""దోస్త్(Dost) అనేది టర్కిష్ మరియు హిందీలో ఒక సాధారణ పదం..మనకు ఒక టర్కీ సామెత ఉంది. "దోస్త్ కారా గుండే బెల్లి ఒలూర్" (అవసరంలో ఉన్న స్నేహితుడు నిజమైన స్నేహితుడు). చాలా ధన్యవాదాలు భారత్"అని ట్వీట్ లో తెలిపారు.
"Dost" is a common word in Turkish and Hindi... We have a Turkish proverb: "Dost kara günde belli olur" (a friend in need is a friend indeed). Thank you very much ????????@narendramodi @PMOIndia @DrSJaishankar @MEAIndia @MOS_MEA #earthquaketurkey https://t.co/nB97RubRJU
— Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 6, 2023
PM Modi Gets Emotional : ఇదిరా భారత్ అంటే : టర్కీ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్న మోదీ
మరోవైపు,భూకంపం కారణంగా అతలాకుతలమైన సిరియాకు భారత్ వైద్య సామాగ్రిని పంపుతుందని రక్షణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో సిరియాకు వైద్య సామాగ్రిని భారతదేశం పంపనుందని రక్షణ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earthquake, India, NDRF, Pm modi, Turkey