Dutch MP Geert Wilder : గత కొన్ని రోజులుగా బహిషృత బీజేపీ నేత నుపుర్ శర్మ (Nupur Sharma)వ్యాఖ్యలపై జరుగుతున్న ఘటనలు అందరికీ తెలిసిందే. ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా మొహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని పలు దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని కన్హయ్య లాల్ అనే ఓ టైలర్(Tailor)ని ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా కత్తులతో నరికి చంపారు(Brutally Murder).దుస్తుల కొలతలు ఇస్తున్నట్టుగా నమ్మించి తల నరికి హత్య చేశారు. ఈ ఘటనను వారు వీడియో తీసి షేర్ చేశారు. రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని ఉదయ్ పూర్(Udaipur)లో మంగళవారం జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
అయితే నూపుర్ శర్మ కు గతంలో మద్దతుగా నిలిచిన నెదరలాండ్స్ దేశానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ విల్డర్స్ (MP Geert Wilders)ఇప్పుడు ఉదయ్ పూర్ హత్యా ఘటనపై ఘాటుగా స్పందించారు. ఇండియాకు ఒక మిత్రుడిగా తాను ఈ సందేశం ఇస్తున్నట్టు గీర్ట్ వైల్డర్స్ చేసిన ఓ ట్వీట్ లో గీర్ట్ వైల్డర్స్ ...''అసహనంపై ఎంతమాత్రం సహనం వద్దు. ఉగ్రవాదం, తీవ్రవాదం, జీహాదిస్టుల నుంచి హిందూయిజానికి రక్షణ ఇవ్వండి. ఇస్లాం పట్ల మెతక వైఖరి వల్ల భారీ మూల్యం చెలలించుకోవాల్సి వస్తుంది. తమను కాపాడే నేతలకు వంద శాతం హిందువులు అండగా నిలవాలి" అని అన్నారు. మరో ట్వీట్ లో "భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉండాలి. ఇది వారి దేశం, వారి మాతృభూమి, ఇది వారిది. భారతదేశం ఇస్లామిక్ దేశం కాదు"అని తెలిపారు. ఐ సపోర్ట్ నుపూర్ శర్మఅనే హ్యాష్ ట్యాగ్స్ తో ఆయన ఈ ట్వీట్స్ చేశారు.
Please India as a friend I tell you: stop being tolerant to the intolerant. Defend Hinduism against the extremists, terrorists and jihadists. Don’t appease Islam, for it will cost you dearly. Hindus deserve leaders that protect them for the full 100%!#HinduLivesMatters #India
— Geert Wilders (@geertwilderspvv) June 28, 2022
Hindus should be safe in India.
— Geert Wilders (@geertwilderspvv) June 28, 2022
It is their country, their homeland, it’s theirs!
India is no Islamic nation. #IsupportNupurSharma #India #HinduLivesMatters
మదర్సాలలో పాఠాలే వీటంతటికి కారణం..ఉదయ్ పూర్ హత్య ఘటనపై కేరళ గవర్నర్
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. కాగా ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యా లాల్ స్వస్థలం మల్దాస్ ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ కన్హయ్య అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చారు.
కన్హయ్యలాల్ హత్య నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. రాబోయే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపాయి. మొత్తంగా 10 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Rajastan