బాతుకు కృత్రిమ కాళ్లు... డాక్టర్లపై ప్రశంసల జల్లు...

Tennessee : కాళ్లు లేని ఆ బాతును చూసిన డాక్టర్లు చలించిపోయారు. ఏదో ఒకటి చేసి... కాళ్లు తేవాలనుకున్నారు. వాళ్ల ప్రయత్నం ఫలించింది. బుజ్జి బాతు చక్కగా నడుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 2:02 PM IST
బాతుకు కృత్రిమ కాళ్లు... డాక్టర్లపై ప్రశంసల జల్లు...
కృత్రిమ కాళ్లతో నడుస్తున్న బాతు (Image - FB - Rocky Top Veterinary Hospital)
  • Share this:
అది అమెరికా... టెన్నెస్సీలోని రాకీ టాప్ వెటెరినరీ హాస్పిటల్. అక్కడికి తన బాతు జెన్నీని తీసుకొచ్చారు దాన్ని పెంచుకుంటున్న జాన్ దిక్సన్. దానికి రెండు కాళ్లూ కన్నం పడిపోయాయి. నడవలేని స్థితిలోకి వెళ్లిపోయింది. వైద్య భాషలో ఈ రకమైన సమస్యను బంబుల్‌ఫుట్ (bumblefoot) అంటారు. బాతుల వంటి పక్షులకు... కఠినమైన రోడ్లు, రాళ్లపై నడిచేటప్పుడు... కాళ్ల అడుగుబాగాలు అరిగిపోయి... కన్నం పడిపోతాయి. ఈ కేసులో జెన్నీ బాతును చూసిన డాక్టర్లకు మొదట ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గాయాలపాలైన జంతువులు, పక్షులకు ట్రీట్‌మెంట్ చేసే ఆ డాక్టర్లు... కాళ్లు కన్నాలు పడిన బాతుకి... ఎలా ట్రీట్‌మెంట్ చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్లలో ఒకరు... దగ్గర్లోని హార్ట్‌వేర్ స్టోర్‌కి వెళ్లారు. కిచెన్ మాట్స్‌ కొన్నారు. బాతు కాళ్ల ఆకారంలో వాటిని కట్ చేసి... ఆర్థోపెడిక్ షూస్ తయారుచేశారు.ఇప్పుడు కృత్రిమ కాళ్లతో... జెన్నీ హాయిగా నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని హాస్పిటల్ డాక్టర్లు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు... డాక్టర్లను మెచ్చుకుంటున్నారు.
First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading