Home /News /international /

DUBAI TEENAGER FILES CASE AGAINST DAD HERE IS THE DETAILS SU

Son Files Case: తండ్రిపై కేసు వేసిన యువకుడు.. సాయం చేయమని పోలీసుల వద్దకు.. ఇంతకీ ఆ తండ్రి ఏం కోరాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

17 ఏళ్ల యువకుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సాయం చేయాల్సిందిగా కోరాడు. అతడు ఎందుకిలా చేశాడో తెలిస్తే షాక్ కావాల్సిందే..

    17 ఏళ్ల యువకుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సాయం చేయాల్సిందిగా కోరాడు. ఈ ఘటన దుబాయ్‌లో(Dubai) చోటుచేసుకుంది. అయితే ఆ యువకుడు ఎందుకలా చేశాడో తెలియాంటే ఈ స్టోరి చదవాల్సిందే.. ఓ వ్యక్తి తన కొడుకు మంచి గ్రేడ్‌లు సాధించలేదని నిరాశ చెందాడు. ఈ గ్రేడ్‌లతో కొడుకు తాను పనిచేస్తున్న కాలేజ్‌లో సీటు రాదని.. అందుకోసం మంచి గ్రేడ్‌లు సాధించేందుకు చదివిన తరగతిలోనే మళ్లీ చదవాలని ఫోర్స్ చేశాడు. తద్వారా తాను పనిచేస్తున్న కాలేజ్‌లో కొడుకు చేరవచ్చని భావించాడు. అయితే తండ్రి నిర్ణయాన్ని పాటించడం కొడుకుకు ఇష్టం లేదు. దీంతో అతడు తల్లితో కలిసి ఈ విషయాన్ని దుబాయ్ పోలీసుల(Dubai Police) దృష్టికి తీసుకెళ్లాడు. తన తండ్రిపై ఫిర్యాదు చేసి.. సాయం చేయాలని కోరాడు. పోలీసులు ఈ కేసును చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు తండ్రి, కొడుకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పిల్లల అభిప్రాయాన్ని గౌరవించాలని తండ్రికి, తండ్రి మాటకు విలువ ఇవ్వాలని కుమారుడిని నచ్చజెప్పారు.

    ఇక, ఈ విషయంలో నిర్ణయాన్ని తండ్రి కొడుకుకే వదిలేయడానికి అంగీకరించారు. దీంతో పిల్లల హక్కుల ఉల్లంఘన లేకుండా అసమ్మతి పరిష్కరించబడింది. ఇందుకు సంబంధించి చైల్డ్ ప్రొటెక్షన్ సెక్షన్ హెడ్ అయితన మైత మహ్మద్ అల్ బుల్‌షి(Maitha Mohammed Al Balushi) మాట్లాడుతూ.. ‘కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి తన తల్లితో కలిసి డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించాడు. అతడి అడుగుజాడల్లో నడవాలని తన తండ్రి ఆశపడుతున్నాడని యువకుడు చెప్పాడు. అంతేకాకుండా విద్య, పని అదే ఫీల్డ్‌లో చేయాలని కోరుతున్నాడని.. ఇది తనకు ఆందోళన కలిగిస్తుందని తెలిపాడు. తండ్రి పనిచేసే కాలేజ్‌లో చేరేందుకు యువకుడు సరైన గ్రేడులు అర్హత సాధించలేదు. దీంతో అతడు మరోసారి యువకుడిని హైస్కూల్‌‌లో చదివించి.. మెరుగైన గ్రేడ్‌లు తెచ్చుకోవాలని బలవంతం చేశాడు’అని వివరించారు.

    Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..

    మానవ హక్కుల విభాగంలో చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ అలీ మహమ్మద్ మాతృషి (Major Dr Ali Muhammad Al Matroushi) మాట్లాడుతూ.. ‘పిల్లలు తమ వయస్సు, పరిపక్వత ప్రకారం వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉంది. అవి UAEలో అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా, పబ్లిక్ ఆర్డర్, నైతికత కలిగి ఉండాలి. పిల్లలు, మహిళల రక్షణ విభాగానికి నివేదించబడిన ప్రతి కేసుపై దుబాయ్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మేము కుటుంబ బంధాలు, పిల్లల ప్రయోజనాలకు అన్నింటికంటే ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే ఈ రకమైన కుటుంబ అసమ్మతిని సామరస్యపూర్వకంగా పరిష్కరించబడుతుందని మేము నమ్ముతాం’ అని చెప్పారు.

    Very Sad: తన మూత్రం తానే తాగిన తల్లి.. పిల్లలకు పాలు పట్టించి బతికించుకోవడానికి తల్లి చేసిన త్యాగం.. కానీ పాపం చివరకు..

    ఇటువంటి కేసులను ఓపెన్ మైండెడ్ చర్చలు జరపుతామని మహ్మద్ మాతృషి అన్నారు. కేసులు అక్కడ పరిష్కరించబడితే.. తాము ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Dubai, Police Case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు