హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

CoronaVirus | ఆ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు రెండూ బంద్

CoronaVirus | ఆ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు రెండూ బంద్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దుబాయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలెవరూ ఇంటి నుంచి కాలు బయటపెట్టొద్దని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇందుకోసమే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మన దేశంలోనే కాదు... ఇతర దేశాల్లోనూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు. దుబాయ్‌లోనూ ఇది కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దుబాయ్ న్యాయశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎలాంటి పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన కార్యకలాపాలు ఉండొద్దని హుకుం జారీ చేసింది. తమ సన్నిహితుల మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం కూడా నిషేధమని దుబాయ్ న్యాయశాఖ స్పష్టం చేసింది.

    పెళ్లిళ్ల వంటి వేడుకలకు ఫేవరెట్ డెస్టినేషన్‌గా భావించే దుబాయ్‌లో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం చాలామందికి నిరాశ కలిగిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇప్పటికే 2 వేల కరోనా కేసులు నమోదు కాగా... ఈ వైరస్ కారణంగా 12 మంది చనిపోయారు. అక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా కచ్చితంగా పోలీసు పర్మిషన్ తీసుకోవాల్సిన నిబంధనను అమలు చేస్తున్నారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Dubai, Marriage