హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Currency on road: రోడ్లపై నోట్ల కట్టలు.. వాహనాలు ఆపి ఎగబడిన జనం.. దొరికినోడికి దొరికినంత..

Currency on road: రోడ్లపై నోట్ల కట్టలు.. వాహనాలు ఆపి ఎగబడిన జనం.. దొరికినోడికి దొరికినంత..

రోడ్లపై కరెన్సీ  నోట్లు

రోడ్లపై కరెన్సీ నోట్లు

Currency notes on road: రోడ్డు మీద రయ్..మని దూసుకెళ్తున్న వారు కూడా ఆ నోట్లను చూసి హఠాత్తుగా ఆగిపోయారు. నోట్లను తీసుకునేందుకు పోటీపడ్డారు.

డబ్బు..! రైలు బండిని నడిపేది పచ్చ జెండా అయితే.. మన బతుకు బండిని నడిపేది పచ్చ నోటు. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. డబ్బు మీదే ఈ ప్రపంచం నడుస్తోంది. ఎందుకంటే ఆ డబ్బు లేకుంటే మనం బతకలేం. నాలుగు రాళ్లు సంపాదిస్తేనే మన కుటుంబం గడుస్తుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు జనాలు. అలాంటి కరెన్సీ కట్టలు ఊరికే లభిస్తే.. అది కూడా రోడ్డు మీద చిత్తు కాగితాల్లా దొరికితే.. ఎవరు ఊరుకుంటారు. అందిన కాడికి పట్టుకెళ్తారు. పోటీపడి మరీ తీసుకెళ్తారు. అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. హైవేపై వేగంగా వెళుతున్న ట్రక్కు నుంచి భారీగా నగదు సంచులు జారిపడ్డాయి. ఆ కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాస్త ఎక్కువ పోగయ్యే సరికి కరెన్సీ నోట్లు స్పష్టంగా కనిపించాయి. రోడ్డు మీద రయ్..మని దూసుకెళ్తున్న వారు కూడా ఆ నోట్లను చూసి హఠాత్తుగా ఆగిపోయారు. నోట్లను తీసుకునేందుకు పోటీపడ్డారు.

ఆ దేశాన్ని మళ్లీ చుట్టుముట్టిన కరోనా.. ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​..

అమెరికా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం శాండియోగో నుంచి కాలిఫొర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బుల కట్టలతో ఓ ట్రక్కు బయలుదేరింది. దక్షిణ కాలిఫొర్నియాలోని ఫ్రీవే మీదుగా ట్రక్కు వెళ్తుండగా ఉదయం 09.15 సమయంలో దాని డోర్ ఒకటి తెరచుకుంది. అంతే లోపల ఉన్న డబ్బు సంచులు బయటపడ్డాయి. నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. వాటిని చూసి వాహనదారులు షాక్ అయ్యారు. వెంటనే తమ వాహనాలను ఆపి డబ్బులను తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆ వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.

సోషల్​ మీడియాలో లీకైన అశ్లీల వీడియో.. మహిళా ఎమ్మెల్యేదంటూ నెటిజన్ల విమర్శలు.. ఎవరిదంటే

' isDesktop="true" id="1094866" youtubeid="doFWSgzXFGU" category="international">

ఐతే డబ్బులు తీసుకున్న వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. హైవేపై పడిన కరెన్సీ నోట్లను ఎవరెవరు తీసుకున్నారో వారంతా తిరిగి ఇచ్చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నగదు తీసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేసులకు భయపడి దాదాపు 12 మంది తాము తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చారు. ఎంత డబ్బు పోయిందో వెల్లడించిన అమెరికా అధికారులు.. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఐతే ట్రక్కు నుంచి దాదాపు 3 లక్షల డాలర్ల నగదు పోయినట్లు తెలిసింది.

First published:

Tags: America, Trending, Us news, Viral Video

ఉత్తమ కథలు