నడిరోడ్డుపై నోట్ల వర్షం...పోటీ పడి ఏరుకున్న జనం

510,000 డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయలు రోడ్డు పొడవునా పడిపోయాయి

news18-telugu
Updated: December 16, 2018, 11:29 AM IST
నడిరోడ్డుపై నోట్ల వర్షం...పోటీ పడి ఏరుకున్న జనం
అమెరికన్ కరెన్సీ
  • Share this:
ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది. అలా డబ్బులు పడుతూ ఉంటే మనం ఏం చేస్తాం. పోటీ పడి ఏరుకోం. అచ్చంగా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. రోడ్డుపై కరెన్సీ పడటంతో జనం పోటా పోటీగా ఏరుకున్నారు. ఈ అరుదైన ఘటన అమెరికా న్యూజెర్సీలో చోటు చేసుకుంది.

న్యూజెర్సీలో ఓ ఆర్మీ ట్రక్కు రోడ్డుపై డబ్బులు వెదజల్లుకుంటూ పోయింది. దీంతో ఏరుకునేందుకు పోటీపడ్డారు వాహనదారులు. దాదాపు 510,000 డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయలు రోడ్డు పొడవునా పడిపోయాయి. దీంతో ఏరుకునేందుకు వాహనదారులు, పాదచారులు క్యూ కట్టారు. డబ్బులు ఏరుకునే వారితో రోడ్డు రద్దీగా మారింది. వాహన డ్రైవర్లు డబ్బులను చూసి ఒక్కసారిగా బ్రేకులు వేడయంతో పలు ప్రాంతాల్లో చిన్నచిన్న ప్రమాదాలు జరిగాయి.

ట్రక్కులో రెండు బ్యాగుల్లో ఒకదాంట్లో 140,000 డాలర్లు, మరో దాంట్లో 370,000 డాలర్లు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు ఆర్మీ అధికారులు. ఈ బ్యాగుల్లోని నోట్లు వెనక డోర్ నుంచి చెల్లాచెదురుగా పడ్డాయన్నారు. డ్రైవర్ గమనించకపోవడంతో దారిపొడవునా డబ్బులు పడినట్టు వివరించారు. ఇప్పటి వరకు 205,375 డాలర్లను బైకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, మరో ఐదుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా 11,090 డాలర్లను వెనక్కి ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా 3 లక్షల డాలర్లు దొరకాల్సి ఉందన్నారు. మొత్తం మీద రోడ్లపై నోట్ల వర్షం కురవడంతో కరెన్సీని ఏరుకుంటూ కొందరు పండగ చేసుకుంటున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 16, 2018, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading