హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: మసీదులో ముక్కలుగా శవాలు -శుక్రవారం ప్రార్థనల్లో భారీ పేలుడు -షాకింగ్ videos

Afghanistan: మసీదులో ముక్కలుగా శవాలు -శుక్రవారం ప్రార్థనల్లో భారీ పేలుడు -షాకింగ్ videos

అఫ్గాన్ మసీదులో భారీ పేలుడు

అఫ్గాన్ మసీదులో భారీ పేలుడు

Several dead In Afghanistan's Kunduz Mosque Blast | తాలిబన్ ఏలుబడిలోని అఫ్గానిస్థాన్ లో రక్తపాతం కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల్లోనే అతిపెద్ద పేలుడు ఘటన శుక్రవారం సంభవించింది. ఉత్తర అఫ్గాన్ లోని కుందుజ్ ప్రావిన్స్ లో గల ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు ధాటికి అక్కడున్నవారు ముక్కలైపోయారు..

ఇంకా చదవండి ...

దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కీలకమైన కుందుజ్ రాష్ట్రంలో ఓ మసీదులో భారీ విస్పోటం సంభవించింది. శుక్రవారం కావడంతో జనం పెద్ద ఎత్తున ప్రార్థనలకు రాగా, ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో జరిగింది.  అంతర్జాతీయ మీడియా వెల్లడిచిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 50 దాటగా, అఫ్గాన్ స్థానిక మీడియా మాత్రం మరణాల సంఖ్య 100కుపైగా ఉండొచ్చని తెలిపింది. గాయపడ్డవారి సంఖ్య కూడా వందల్లో ఉన్నట్లు సమాచారం.

కుందుజ్ ప్రావిన్స్ లోని ఖాన్‌ అబాద్‌ ప్రాంతంలో ఎక్కువగా షియాలు నివసిస్తుంటారు. అక్కడి షియాల మసీదునే టార్గెట్ చేసుకుని, సరిగ్గా ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు  జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, దీనికి బాధ్యులు ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు.

కుందుజ్ లోని ఖాన్ అబాద్ మసీదులో పేలుళ్ల ఘటనపై తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్‌ స్పందించారు. షియాల మసీదు లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టాయన్నారు.

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైపోయిన తర్వాత అంతర్జాతీయంగా కార్యకలాపాలున్న పలు ఉగ్రవాద సంస్థలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఐసిస్ లాంటి సంస్థలు ఏకంగా తమ బేస్ క్యాంపును అఫ్గాన్ కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. అఫ్గాన్ లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని చెబుతోన్న తాలిబన్లు తాజా ఘటనపై ఎలాంటి ప్రతిచర్యలకు దిగుతారో తెలియాల్సి ఉంది.

First published:

Tags: Afghanistan, Bomb blast, Masjid

ఉత్తమ కథలు