DONALD TRUMP TO LAUNCH HIS SOCIAL MEDIA APP IN FEBRUARY LISTING SHOWS GH VB
Trump Social Media: ట్విట్టర్‌కు పోటీగా ట్రంప్ సోషల్ మీడియా యాప్ లాంచ్.. ఆ వివరాలివే..
డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్ ను ఫిబ్రవరి 21న ప్రారంభించనున్నారు. యాప్ మోడల్‌ను గమనిస్తే.. ట్విట్టర్లో మాదిరే ఇందులోనూ పలు ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన సోషల్ మీడియా యాప్(Social Media App) ట్రూత్ సోషల్ (TRUTH Social)ను ఫిబ్రవరి 21న ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆ యాప్‌ను Apple స్టోర్‌లో లిస్టింగ్ చేసినట్లు సమాచారం. గతేడాది క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి, తదనంతర పరిణామాల అనంతరం ట్రంప్‌ను (Donald Trump) సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు బహిష్కిరించిన నేపథ్యంలో ఆయన సొంతంగా దీనిని ప్రారంభిస్తున్నారు. TRUTH Social యాప్‌ను ట్విట్టర్‌కు పోటీగా తీసుకొస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చేనెల అమెరికా అధ్యక్షుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యక్ష ప్రసారంలో దీనిని లాంచ్ చేయనున్నట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) ప్రకటించింది. యాప్ మోడల్‌ను గమనిస్తే.. ట్విట్టర్లో మాదిరే ఇందులోనూ పలు ఫీచర్లు ఉన్నాయి.
వ్యక్తులు, ట్రెండింగ్ అంశాలను అనుసరించేందుకు వీలుంటుంది. ట్వీట్ లాంటి సందేశాన్ని "ట్రూత్"గా పిలుస్తున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆధారాలు లేవని ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం బైడెన్ నియామకాన్ని అడ్డుకునేందుకు ట్రంప్(trump latest news) మద్దతుదారులు జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి దిగారు. అయితే అప్పటి ఔట్ గోయింగ్ అధ్యక్షుడైన ట్రంపే ఈ హింసను ప్రేరేపించారని, తన మద్దతుదారులను ప్రోత్సహించారని ఆరోపిస్తూ ఫేస్బుక్, ట్విట్టర్లు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిషేధించాయి. ఈ ఘటన జరిగిన 13 నెలల అనంతరం ట్రంప్ సొంత యాప్ ప్రారంభం కానుంది.
అయితే ఈ వార్తలపై అటు ట్రంప్ మీడియా(TMTG) కానీ.. యాపిల్(Apple)కానీ అధికారికంగా స్పందించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21న ‘ట్రూత్ సోషల్’ యాప్ ప్రారంభం కానుంది. ట్రూత్ సోషల్ యాప్ యాపిల్ స్టోర్‌లో రిజిస్టరైందన్న నివేదికల అనంతరం TMTG సంస్థ మార్కెట్ విలువ 20% పెరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ మొత్తం విలువ 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రంప్‌కి ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో ట్రూత్ సోషల్ యాప్(truth social media) వాణిజ్యపరంగా విజయవంతమవుతుందని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు.
ప్రీమియం సేవలు సైతం
ట్రంప్‌నకు సంబంధించిన TMTG మీడియా మొత్తం మూడు రకాలుగా అందుబాటులో ఉండే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఇందులో ట్రూత్ సోషల్ మొదటిది కాగా.. రెండోది.. వినోదం, వార్తలు, పాడ్‌కాస్ట్‌లను అందించే TMTG+ అనే సబ్స్క్రిప్షన్ బేస్డ్ వీడియో-ఆన్-డిమాండ్ సేవ. ఇవేగాక.. పోడ్కాస్ట్ నెట్‌వర్క్‌ను సైతం ప్రారంభించాలనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు క్యాపిటల్ భవనంపై దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రసంగించారు. గత అధ్యక్షుల తప్పుడు నిర్ణయాలను అమలు చేయబోమని ఉద్ఘాటించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.