news18-telugu
Updated: April 23, 2020, 7:00 AM IST
ట్రంప్ (File)
Donald Trump : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 60 రోజుల పాటు వలసదారీ విధానాన్ని (immigration policy) తాత్కాలికంగా రద్దుచేస్తూ పరిపాలనా పరమైన ఆదేశంపై సంతకం చేసిన ఆయన.. గ్రీన్ కార్డుల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 60 రోజుల పాటు వీటిని ఆపేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆదేశాల పత్రాలపై ఈ రోజు సంతకం చేయనున్నారు కూడా. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 60 రోజుల తర్వాత దీనిని పొడిగించాలా? సవరణలు చేయాలా? అన్నది విశ్లేషిస్తామని ట్రంప్ చెప్పారు.
అటు.. అమెరికాలో శాశ్వత నివాసం కోరుకుంటున్నవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత వలస చట్టం ప్రకారం.. అమెరికా ప్రతి ఏటా గరిష్ఠంగా 1.4 లక్షల గ్రీన్ కార్డులు జారీ చేస్తోంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
April 23, 2020, 7:00 AM IST