హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

H-1B వీసాదారులకు షాక్... ట్రంప్ సంతకం... అమెరికాలోకి వాళ్లకు నో ఎంట్రీ...

H-1B వీసాదారులకు షాక్... ట్రంప్ సంతకం... అమెరికాలోకి వాళ్లకు నో ఎంట్రీ...

ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుందని, కుటుంబాలను విడదీస్తుందని భారతీయుల తరపున దావా వేసిన న్యాయవాది వాస్డెన్ బనియాస్ కోర్టుకు తెలిపారు.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుందని, కుటుంబాలను విడదీస్తుందని భారతీయుల తరపున దావా వేసిన న్యాయవాది వాస్డెన్ బనియాస్ కోర్టుకు తెలిపారు.

ట్రంప్ మరోసారి స్థానికత అంశాన్ని నెత్తినెత్తుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

కొంతమంది విదేశీ వర్కర్లను అమెరికాకు రాకుండా సస్పెండ్ చేస్తూ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మంగళవారం... ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల H-1B వీసాలు, L వీసాలు, H-2B సీజనల్ వర్కర్ వీసాలు, J వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి... తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ కొత్త ప్రత్యేక ఆదేశాలు... జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. "అదనంగా వర్కర్లు ఆయా వీసాలతో అమెరికాలోకి వస్తే... అది స్థానిక ఉద్యోగ అవకాశాలకు సమస్యగా మారుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా... అమెరికన్లతోపాటూ... అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది" అని ప్రత్యేక ఆదేశాల్లో తెలిపారు.

ప్రభావవంతమైన నాన్-ఇమ్మిగ్రాంట్ వీసా లేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయి. జూన్ 24 నుంచి అమెరికాలో లేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అమెరికా పౌరులకు చెందిన భార్యలు, వారి పిల్లలకు ఈ ఆదేశాలు వర్తించవు. ముఖ్యంగా ఫుడ్ సప్లై రంగంలో ఉన్నవారికి అస్సలు వర్తించవు. విదేశీ వర్కర్ల వల్ల అమెరికన్లకు సమస్య ఏర్పడుతోంది కాబట్టే... సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రత్యేక ఆదేశంలో తెలిపారు.

"2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య 1.7 కోట్ల ఉద్యోగాలను అమెరికా వివిధ పరిశ్రమల్లో కోల్పోయింది. ఈ ఉద్యోగాలను H-2B నాన్-ఇమ్మిగ్రాంట్ వీసాలు, L వీసాల వర్కర్లతో భర్తీ చెయ్యాలని కంపెనీల యజమానులు భావిస్తున్నారు" అని ప్రత్యేక ఆదేశంలో ట్రంప్ తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకే ఈ ఆదేశం ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికాలో డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో... అమెరికన్లకు మద్దతుగా చర్యలు తీసుకోవడం ద్వారా... మరోసారి అధ్యక్ష పీఠాన్ని ఎక్కాలని ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నారు. విదేశీయుల్ని కట్టడి చెయ్యడం ద్వారా... స్థానిక యువతలో క్రేజ్ తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు. ఐతే... ప్రస్తుతం ట్రంప్‌కి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కరోనాను ఆయన ఏమాత్రం కంట్రోల్ చెయ్యలేకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

First published:

Tags: America, Visa

ఉత్తమ కథలు