హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Us Elections 2020: ఫేస్ టు ఫేస్ అయితేనే వస్తా..! బిడెన్ తో డిబేట్ పై ట్రంప్

Us Elections 2020: ఫేస్ టు ఫేస్ అయితేనే వస్తా..! బిడెన్ తో డిబేట్ పై ట్రంప్

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

కోవిడ్ తో బాధపడుతున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లో కరుకుతనం మాత్రం తగ్గలేదు. ఈనెల 15న జరగాల్సి ఉన్న ప్రెసిడెన్షియల్ డిబేట్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • News18
 • Last Updated :

  తరుచూ ఏదో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడంలో అమెరికా అధ్యక్షుడి తర్వాతే ఎవరైనా.. కోవిడ్ వచ్చి ఐదు రోజులు హాస్పిటల్ లో ఉన్నా.. ఆయన మాటలో కరుకుతనం మాత్రం తగ్గడం లేదు. ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ తో జరగాల్సి ఉన్న సెకండ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చర్చను ముఖాముఖి నిర్వహిస్తేనే తాను పాల్గొంటానని.. అలా కాకుండా వర్చువల్ మీటింగ్ ల ద్వారా నిర్వహిస్తే మాత్రం తాను రాబోనని స్పష్టం చేశారు. ఇదే విషయయై ఒక యూఎస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  ట్రంప్ మాట్లాడుతూ.. ఇరువురి మధ్య సంధానకర్తగా ఉండాల్సిన ద్వైపాక్షిక బృందం.. తన ప్రత్యర్థి జో బిడెన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ట్రంప్ కు కరోనా సోకడంతో బుధవారం బిడెన్ స్పందిస్తూ.. అధ్యక్షుడి ప్రస్తుత పరిస్థితేంటో తనకు తెలియదని, కానీ కోవిడ్ నిబంధనలు పాటించడం అందరికి శ్రేయస్కరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ట్రంప్ ఇంకా కోవిడ్ తో ఉన్నట్టైతే.. ఆ డిబేట్ లో తాను పాల్గొనబోనని వ్యాఖ్యానించిన విషయం విదితమే.

  దీనిపై డిబేట్ నిర్వహించే ద్వైపాక్షిక కమిషన్.. ఈ చర్చను ఆన్ లైన్ వేదికగా నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ పై విధంగా స్పందించారు. తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని ఆయన చెప్పారు. బిడెన్ తో సంవాదానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న మియామిలో అధ్యక్ష రేసుకు పోటీపడుతున్న ఈ ఇద్దరి మద్య రెండో డిబేట్ జరగనున్న విషయం తెలిసిందే.

  మరోవైపు అమెరికాలో వస్తున్న పలు నివేదికలు ట్రంప్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ట్రంప్ తో పోలిస్తే బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడని సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగా వస్తున్నాయి. అంతేగాక ఇటీవలే ముగిసిన మొదటి డిబేట్ లో ట్రంప్ కంటే బిడెనే ఎక్కువ పాయింట్లు సంపాదించారు. బుధవారం ముగిసిన ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్ లోనూ డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న కమలా హారిస్ కూడా అదరగొట్టారని టాక్ వినిపిస్తోంది.

  ఇప్పటికే కరోనా  బారిన పడి వైట్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణల ో ఉంటున్న ట్రంప్.. బిడెన్ తో పోలిస్తే  ప్రచారంలో వెనుకబడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇక తాజాాగా వస్తున్న సర్వేలు ఆయనకు మరింత  ఇబ్బంది కలిగించేవే అని  వైట్ హౌస్ వర్గాల టాక్.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Donald trump, Joe Biden, US Elections 2020, Us news

  ఉత్తమ కథలు