ఒబామాకి కాదు నాకు ఇవ్వాలి... నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కామెంట్

Donald Trump : మొండిగా మాట్లాడటం, ప్రతి దానికీ అలకబూనడం వంటివి డొనాల్డ్ ట్రంప్‌లో కనిపించే లక్షణాలు. నోబెల్ శాంతి బహుమతిపై ఆయన ఇలాగే చేశారు. ఒబామాకి ఎందుకివ్వాలంటూ అలకబూనారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 9:44 AM IST
ఒబామాకి కాదు నాకు ఇవ్వాలి... నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కామెంట్
ఒబామా, ట్రంప్ (File)
  • Share this:
Nobel Peace Prize : నోబెల్ ప్రైజ్‌ను ఎవరికి బడితే వాళ్లకు ఇవ్వరు. ముఖ్యంగా శాంతి బహుమతి అనేది... ప్రపంచ శాంతి కోసం నిస్వార్థంతో కృషి చేసేవారికి మాత్రమే ఇస్తారు. ఐతే... అమెరికా గత అధ్యక్షుడైన బరాక్ ఒమాబా... 2009లో బాధ్యతలు చేపట్టాక... అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపించిన దౌత్యం, వివిధ దేశాల మధ్య నెలకొల్పిన సహకారం, ప్రజలతో కలిసి పనిచేసే మనస్తత్వం ఇవన్నీ చూసి... ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం ఇచ్చారు. ఐతే... అప్పట్లో ఒబామాయే కొంత ఆశ్చర్యపోయారు. తన లాంటి వాళ్లకు కూడా అంత గొప్ప అవార్డ్ ఇస్తారా అని అన్నారు. దాంతో అప్పట్లో... ఎవరికి బడితే వాళ్లకు నోబెల్ అవార్డులు ఇచ్చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి.

దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ట్రంప్... అప్పటి వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ఆయన... అక్కడ మాట్లాడుతూ... తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. తనకు చాలా అంశాలకు సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివక్ష లేకుండా ఇచ్చివుంటే... తనకు ఎప్పుడో నోబెల్ వచ్చేదన్నారు. 2009లో ఒబామాకు ఇచ్చినప్పుడు... తనకెందుకు ఇవ్వరన్నది ట్రంప్ అభ్యంతరం.

ఒబామా అమెరికా అధ్యక్షుడు అవ్వగానే వెంటనే నోబెల్ పీస్ ప్రైజ్ ఆయనకు ఇచ్చారు. అసలు అది ఏంటో కూడా ఆయనకు తెలీదు. ఆయనే ఆ విషయం చెప్పారు కూడా. మీకు తెలుసా... ఒబామా విషయంలో నేను ఏకీభవించే అంశం అదే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్


ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లిన ట్రంప్... ఆ సందర్భంగా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. దౌత్యపరమైన అంశాలపై చర్చించారు. 

ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>