HOME »NEWS »INTERNATIONAL »donald trump leaves along with wife melania trump and skips joe biden and kamala harris inauguration ba

Donald Trump: వైట్ హౌస్‌కు వీడ్కోలు చెప్పిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: వైట్ హౌస్‌కు వీడ్కోలు చెప్పిన డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ (Reuters)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక భవనం వైట్ హౌస్‌కు గుడ్ బై చెప్పారు. తన భార్య మెలానియా ట్రంప్‌తో కలసి ఆయన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి బయటకు నడిచారు. ఆయన ఫ్లోరిడాకు వెళ్తున్నారు. అక్కడే ఉంటారు.

  • Share this:
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక భవనం వైట్ హౌస్‌కు గుడ్ బై చెప్పారు. తన భార్య మెలానియా ట్రంప్‌తో కలసి ఆయన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి బయటకు నడిచారు. ఆయన ఫ్లోరిడాకు వెళ్తున్నారు. అక్కడే ఉంటారు. ఆయన కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ , కొత్త ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం లేదు. గడిచిన 150 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెబుతున్నారు. ఓడిపోయిన అధ్యక్షుడు తన తర్వాత ప్రమాణస్వీకారం చేసే కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ట్రంప్ మాత్రం దీనికి డుమ్మా కొట్టారు. 74 సంవత్సరాల ట్రంప్ తన భార్య మెలానియాతో కలసి చివరిసారిగా వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో రెడ్ కార్పెట్ గుడ్ బై చెప్పారు. వైట్ హౌస్ లాన్‌లో నిలిపిఉంచి మెరైన 1 హెలికాప్టర్ ఎక్కారు. అక్కడి నుంచి ఆయన జాయింట్ బేస్ ఆండ్రూస్ వెళ్తారు. అక్కడ అమెరికా అధ్యక్ష విమానం అయిన ఎయిర్ ఫోర్స్ 1 లో ఫ్లోరిడా వెళ్తారు.

    ఎప్పుడూ నవ్వుతూ హై ఎనర్జీతో ఉండే ట్రంప్ వైట్ హౌస్‌ను వీడుతున్న సమయంలో మాత్రం విలేకరులతో పొడిపొడిగా మాట్లాడారు. ‘నాలుగేళ్లు అద్భుతంగా సాగాయి. జీవితంలో దక్కిన గౌరవం. జస్ట్ గుడ్ బై చెప్పాలనుకుంటున్నా.’ అని అన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ట్రంప్ ఫ్లోరిడాలోని తన రిసార్ట్ మార్ ఎ లగోలో ఉంటారు. వైట్ హౌస్‌లో కేవలం రెడ్ కార్పెట్ మీద సాగనంపారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ 21 గన్ సెల్యూట్ ఉంటుంది.



    అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన వీడ్కోలు సందేశం ఇచ్చారు.  20 నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్రి రికార్డెడ్ వీడియోను వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసింది. ఏం చేసేందుకు అధికారంలోకి వచ్చామో..తన పాలనలో అన్నీ చేశామని ట్రంప్ చెప్పారు. చెప్పినదాని కన్నా ఎక్కువే చేశామని పేర్కొన్నారు. దేశం కోసం కఠినమైన యుద్ధాలు.. పోరాటాలను చేశామని ఆయన అన్నారు.

    ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆర్థిక వ్వవస్థను తమ ప్రభుత్వం నిర్మించిందిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రైటా, లెఫ్టా లేక రిపబ్లికనా లేక డెమొక్రాటా అన్నది తమ అజెండా కాదు. మెరుగైన దేశమే తమ అజెండా ఆయన అన్నారు. ఇటీవల కాపిటల్ భవనంపై జరిగిన దాడిపైనా ఆయన మాట్లాడారు. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగే దాడిగానే చూడాలని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా భద్రత, అభివృద్ధి కోరుకునే వాడిగా.. తదుపరి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 20, 2021, 20:04 IST

    टॉप स्टोरीज