నేడు వియత్నాంలో ట్రంప్-కిమ్ జోంగ్ భేటీ...అణు నిరాయుధీకరణ కీలక చర్చలు

నేడు వియత్నాంలో ట్రంప్-కిమ్ జోంగ్ భేటీ...అణు నిరాయుధీకరణ కీలక చర్చలు

సింగపూర్‌లో కిమ్, ట్రంప్ భేటీ (ఫైల్ ఫొటో)

అణు నిరాయుధీకరణకు సంబంధించిన అనుసరించాల్సిన విధి విధానాలపై భేటీలో దృష్టి కేంద్రీకరించనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగైనప్పటికీ ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఆంక్షల సడలింపుపైనా చర్చ జరిగే అవకాశముంది.

 • Share this:
  తూర్పు-పడమర మళ్లీ కలవబోతున్నాయి. ఉప్పు-నిప్పులా ఉండే ఉత్తరకొరియా, అమెరికా అధ్యక్షుడు మరోసారి సమావేశం కానున్నారు. వియత్నాంలో కిమ్ జోంగ్ఉన్, డొనాల్డ్ ట్రంప్ భేటీ కాబోతున్నారు. హనోయిలోని ఫ్రెంచ్ కలోనియల్ ఎరా మెట్రోపోల్ హోటల్‌లో వీరి భేటీ జరగనుంది. అణు నిరాయుధీకరణకు సంబంధించి ఇరువరి మధ్య కీలక చర్చలు జరగున్నాయి. దీనిపై ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఇరుదేశాధినేతలు సమావేశమై అణు నిరాయుధీకరణపై చర్చించారు. అణ్వస్త్రాలను వీడి శాంతిమార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు జరగబోయేది రెండో భేటీ.

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఇప్పటికే హనోయి చేరుకున్నారు. అటు నార్త్ కొరియా అధ్యక్షుడు సైతం కిమ్ జోంగ్ ఉన్ కూడా 3 రోజుల రైలు ప్రయాణం అనంతరం వియత్నాం చేరారు. ప్యాంగ్యాంగ్ నుంచి చైనా మీదుగా ఆయన రైలు ప్రయాణం చేశారు. సుమారు 3వేల కిలోమీటర్ల ప్రయాణించి హనోయి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఫ్రెంచ్ కలోనియల్ హోటల్‌కు వెళ్లారు. ఇవాళ, రేపు రెండు రోజల పాటు వీరి భేటీ ఉంటుంది.

  గతేడాది జూన్‌లో సింగపూర్‌లో ట్రంప్-కిమ్ మొదటి సమావేశం జరిగింది. ఆ భేటీలో కుదిరిన సమగ్ర ఒప్పందంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. అణు నిరాయుధీకరణకు సంబంధించిన అనుసరించాల్సిన విధి విధానాలపై భేటీలో దృష్టి కేంద్రీకరించనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగైనప్పటికీ ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఆంక్షల సడలింపుపైనా చర్చ జరిగే అవకాశముంది.
  First published:

  అగ్ర కథనాలు