ట్రం‌ప్‌కు పదవీ గండం...ప్రతినిధుల సభలో ఓటమి...

యూఎస్ హౌస్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు అందుకు ఆమోదం తెలిపారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు.

news18-telugu
Updated: December 19, 2019, 9:17 AM IST
ట్రం‌ప్‌కు పదవీ గండం...ప్రతినిధుల సభలో ఓటమి...
డొనాల్డ్ ట్రంప్ (Credit - Twitter - CNN Politics)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ హౌస్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు అందుకు ఆమోదం తెలిపారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినందునే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినట్లు ప్రతిపక్ష డెమొక్రాటిక్‌ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రంప్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశద్రోహానికి పాల్పడ్డారని డెమొక్రాటిక్‌ పార్టీ తన ప్రకటనలో వివరించింది. ఇప్పటికే ట్రంప్‌పై అభిశంసన అభియోగాలకు న్యాయవ్యవహారాల సభా సంఘం ఇటీవల ఆమోదముద్ర వేసింది. సెనేట్ ఆమోదముద్రతో అమెరికన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే అమెరికాలో అభిశంసన ఎదుర్కొంటున్న అధ్యక్షుల్లో ట్రంప్‌ మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం. గతంలో రిచర్డ్‌ నిక్సన్‌, బిల్‌ క్లింటన్‌లు ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు.

కాగా 2020 ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌, ఆయన కుమారుడికి సంబంధించిన వ్యాపార లావాదేవీల సమాచారాన్ని సేకరించేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ట్రంప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు