Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రానున్న ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచనల్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్(Donald trump) చిక్కుల్లో పడ్డారు. ఆయన 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తనతో ఉన్న అక్రమ సంబంధాలను బయటపెట్టకూడదని, ఓ పోర్న్‌స్టార్‌కు 130,000 డాలర్లు ఇవ్వడంపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ గురువారం నేరారోపణ(Indicted) చేసింది. దీంతో నేరారోపణలు ఎదుర్కొన్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు. నేరారోపణ అనేది ఒక వ్యక్తి నేరం చేసినట్లు విశ్వసించినప్పుడు ఉపయోగించే ఫార్మల్ ఛార్జింగ్ డాక్యుమెంట్. ఇందులో వ్యక్తిపై అభియోగాలు ఉంటాయి, కోర్టులో కేసు ముందుకు సాగడానికి ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది.
CNN ప్రకారం.. విచారణ కోసం ట్రంప్ మంగళవారం కోర్టుకు హాజరు కానున్నారు. ఆయనపై మాన్హాటన్ గ్రాండ్ జ్యూరీ దాదాపు 30 కంటే ఎక్కువ నేరారోపణలు చేసింది. అతడి బిజినెస్, రాజకీయం, వ్యక్తిగత వ్యవహారాలపై సంవత్సరాలపాటు పరిశోధనలు జరగడం గమనార్హం.
* ట్రంప్‌పై ఎందుకు అభియోగాలు మోపారు?
పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కి డొనాల్డ్ ట్రంప్ చేసిన డబ్బు చెల్లింపులపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. 2016 ఎన్నికలకు ముందు, ట్రంప్ తన ప్రస్తుత భార్యను వివాహం చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత - పోర్న్‌స్టార్ వ్యవహారం ట్రంప్‌కు ఇబ్బందులు తెచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమెతో ఉన్న ఎఫైర్ బయటకు రాకుండా ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ ఆమెకు డబ్బులు చెల్లించాడు. ఈ విషయాలను యూఎస్ మీడియా బహిర్గతం చేసిన తర్వాత, కోహెన్ ప్రాసిక్యూటర్‌లకు సహకరించాడు. పన్ను, బ్యాంకు మోసం, ఫెడరల్ క్యాంపెయిన్ ఫైనాన్సింగ్ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై 2018లో నేరాన్ని అంగీకరించాడు. దీంతో ట్రంప్ ఆర్గనైజేషన్ పేరును కోహెన్ తాను ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఎలక్షన్ పైనాన్సింగ్ రూల్స్‌ను ట్రంప్ అతిక్రమించినట్లు గుర్తించారు.
OMG: సమాధులు తొవ్వితే .. 3200ఏళ్ల క్రితం నాటి బంగారు నిధి బయటపడింది..ఎక్కడంటే
* ట్రంప్ ఏమి చెప్పారు?
ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. దర్యాప్తుపై పదే పదే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరారోపణను రాజకీయ హింసగా అభివర్ణించారు. డిఫెన్స్ లాయర్లు సుసాన్ నెచెలెస్, జోసెఫ్ టాకోపినా ఒక ప్రకటనలో.. ట్రంప్ ఏ నేరం చేయలేదు. ఈ పొలిటికల్ ప్రాసిక్యూషన్‌పై మేము కోర్టులో తీవ్రంగా పోరాడుతామని పేర్కొన్నారు.
* ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?
2024 ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థిగా ముందంజలో ఉన్న ట్రంప్, విచారణలన్నింటినీ రాజకీయ ప్రక్షాళనగా చెప్పారు. తానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థినని చాటుకునేందుకు, పార్టీపై నియంత్రణ సాధించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో నేరారోపణలు వచ్చాయి. ఈ రేసులో ఊహించిన ప్రముఖ ప్రత్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో ట్రంప్ పేరును ప్రస్తావించడకుండానే నేరారోపణ గురించి అన్-అమెరికన్ అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై నేరారోపణ ప్రభావం అనూహ్యమైంది. నిపుణులు మనీ కేసు చట్టపరమైన అర్హతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ శనివారం టెక్సాస్‌లో తన మొదటి అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించారు, అనేక వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అతను ఊహించిన 15,000 కంటే చాలా తక్కువ మంది హాజరయ్యారు. అయితే ట్రంప్‌పై నేరారోపణలు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, USA