Trump India Tour: ‘డొనాల్ట్ ట్రంప్ నెం.1, ప్రధాని మోదీ నెం.2’

Donald Trump India Tour 2020 | మరో రెండు వారాల్లో భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అగ్రరరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటనను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 

news18-telugu
Updated: February 15, 2020, 8:05 AM IST
Trump India Tour: ‘డొనాల్ట్ ట్రంప్ నెం.1, ప్రధాని మోదీ నెం.2’
ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
మరో రెండు వారాల్లో భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అగ్రరరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటనను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.  ఫేస్‌బుక్‌లో తాను నెంబర్.1, భారత ప్రధాని నరేంద్ర మోదీ నెం.2 అని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చెప్పారని ట్రంప్ గుర్తుచేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం డొనాల్డ్ ట్రంప్, తన భార్య మిలానియా ట్రంప్‌తో కలిసి ఈ నెల 24న తొలిసారిగా భారత పర్యటనకు రానుండడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రంప్ దంపతులు పర్యటిస్తారు. అహ్మదాబాద్‌లో జరిగే హౌడీ మోడీ తరహా సభలో ట్రంప్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు.



ప్రధాని మోదీ ఆహ్వానానికి ధన్యవాదాలు చెబుతూ రెండ్రోజుల క్రితం మినాలియా ట్రంప్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.



భారత్‌లో ట్రంప్ పర్యటనతో ఇరు దేశాల మధ్య మైత్రీ సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆశాభావం వ్యక్తంచేశారు. ఇరు దేశాలకు ఉపయుక్తంగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా పాల ఉత్పత్తులు, కోడి మాంసం దిగుమతులను భారత్‌లోకి పాక్షికంగా అనుమతించేందుకు భారత్ అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: February 15, 2020, 7:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading