తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్గానిస్తాన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారణమంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. తాను అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ఆయన అన్నారు. ఆఫ్గాన్ లో ఇలాంటి పరిస్థితుల కల్పనకు కారణమైనందుకు బైడెన్ రాజీనామా చేయాలంటూ ఫైర్ అయ్యారు. అమెరికా హిస్టరీలోనే ఇది ఒక ఫెయిల్యూర్ అంటూ ట్రంప్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఆఫ్గాన్ విషయంలో బైడైన్ చాలా గొప్ప పని చేశారంటూ తనదైన స్టైల్ లో ఎద్దేవా చేశారు. ఆఫ్గాన్ లో సంక్షోభ సమయంలో బైడెన్ వ్యవహరించిన తీరును ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. తాలిబన్లపై చేస్తున్న యుద్ధంపై ఖర్చు చాలా ఎక్కువ అవుతుండడంతో ఆఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కు వచ్చే ప్రక్రియకు ట్రంప్ హయాంలోనే అంటే గతేడాది ఫిబ్రవరిలోనే ఒప్పంది కుదిరింది. అయితే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 31 నాటికే ఆఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.
Taliban Effect on India: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు.. భారత్ ముందు సరికొత్త సవాళ్లు
అయితే.. అంతకు ముందు తాలిబన్లతో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం.. ఆఫ్గాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో తాలిబన్లు అధికారం పంచుకోవాలనే షరతు విధించారు. కానీ బైడెన్ అలాంటి షరతులు పట్టించుకోలేదు. తాను అధికారంలో ఉంటే ఈ ప్రక్రియ అత్యంత శాతియుతంగా జరిగి ఉండేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలోని ఆఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. వైట్ హౌస్ ఎదుట పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్ సరిగా వ్యవహరించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ భవితవ్యంపై అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పౌర హక్కులను కాలరాసిన తాలిబన్లు మళ్లీ అధికారం చేపడితే, పరిస్థితి ఏంటనే భయం అక్కడి యువత, మహిళలను వెంటాడుతోంది. దీంతో సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సైతం అక్కడి ప్రజలు వెనుకాడట్లేదు. ఈ క్రమంలో భారత దేశంలోని యూనివర్సిటీల్లో చదువుతున్న అఫ్గాన్ విద్యార్థులు, మళ్లీ తమను భారత్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ బాంబే.
అఫ్గాన్ విద్యార్థులు క్యాంపస్ హాస్టళ్లలో చేరడానికి అనుమతించింది. అఫ్గాన్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారు. అయితే కోవిడ్ కారణంగా వారు సొంత దేశానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో అస్థిర పరిస్థులు నెలకొనడంతో భారతీయ విద్యాసంస్థల్లో క్యాంపస్‌లకు తిరిగి వచ్చేందుకు అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చి చదువు కొనసాగించవచ్చని ఐఐటీ బాంబే ప్రకటించింది. ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాసిస్ చౌధురి ఫేస్‌బుక్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Donald trump, Joe Biden, Taliban