అమెరికాకు ‘టెలికాం ముప్పు’.. ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న సమయంలో ఈ ఎమర్జెన్సీ విధించడం విశేషం. గత ఏడాది చైనా కంపెనీ హువాయి కి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: May 16, 2019, 3:11 PM IST
అమెరికాకు ‘టెలికాం ముప్పు’.. ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: May 16, 2019, 3:11 PM IST
అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికన్ కంపెనీలకు టెలికాం ముప్పు ఉందన్న అనుమానంతో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికన్ కంపెనీలకు ముప్పు తెచ్చేలా కొన్ని సంస్థలు తయారు చేసిన పరికరాలను వాడొద్దంటూ కంపెనీలకు సూచించారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించే హక్కు అధ్యక్షుడికి ఉంటుందని న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ తెలిపింది. ‘దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు సంతకం చేశారు. దేశంలో సమాచార సాంకేతిక వ్యవస్థను, వాటి సేవలను సంరక్షించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.’ అని వైట్ హౌస్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న సమయంలో ఈ ఎమర్జెన్సీ విధించడం విశేషం. గత ఏడాది చైనా కంపెనీ హువాయి కి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...