ఐసిస్ చీఫ్ బాగ్దాది ఆత్మాహుతి.. ధ్రువీకరించిన డొనాల్డ్ ట్రంప్..

ISIS Chief Abu Bakr Al Bagdhad death : అమెరికా వాయుసైన్యం వైమానిక దాడులు జరుపుతున్న సమయంలో.. బాగ్దాది బంకర్‌లో దాక్కున్నాడని చెప్పారు. అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే.. ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు.

news18-telugu
Updated: October 27, 2019, 7:32 PM IST
ఐసిస్ చీఫ్ బాగ్దాది ఆత్మాహుతి.. ధ్రువీకరించిన డొనాల్డ్ ట్రంప్..
డొనాల్డ్ ట్రంప్ (File Photo)
  • Share this:
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ఐసిస్) చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది ఆత్మాహుతి దాడిలో చనిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. డీఎన్ఏ టెస్టులు కూడా చేశామని.. చనిపోయింది బాగ్దాదియే అని తేలిందని తెలిపారు. అమెరికా వాయుసైన్యం వైమానిక దాడులు జరుపుతున్న సమయంలో.. బాగ్దాది బంకర్‌లో దాక్కున్నాడని చెప్పారు. అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే.. ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు. అతనితో పాటు అతని ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారని చెప్పారు. బాగ్దాది కుక్క చావు చచ్చాడని వ్యాఖ్యానించారు.

బాగ్ధాదిని మట్టుబెట్టడానికి కొన్ని వారాల నుంచి నిఘా పెట్టామని.. రెండు,మూడు మిషన్స్ ఫెయిల్ అయ్యాక ఎట్టకేలకు మరో మిషన్‌లో అతను మృతి చెందాడని తెలిపారు.మిషన్ సందర్భంగా అమెరికా వైమానిక సేనలు రష్యా గగన తలంపై నుంచి ఎగిరాయని తెలిపారు. అమెరికాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేషన్ మొత్తాన్ని వీక్షించినట్టు చెప్పారు. బాగ్ధాదికి సంబంధించి కీలక సమాచారాన్ని సిరియన్ కుర్దులు అమెరికాకు ఇచ్చారని తెలిపారు.వేల మందిని పొట్టనబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన బాగ్దాది చివరకు పిరికివాడిలా సొరంగంలో దాక్కుని ఏడ్చాడని.. ఆపై ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడని పేర్కొన్నారు. అమెరికా ఆపరేషన్‌కు సహకరించినందుకు రష్యా,టర్కీ,సిరియా,ఇరాక్‌లకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆపరేషన్‌ను రాత్రి సమయంలో చేపట్టారు. ఆపరేషన్‌లో అమెరికా వైమానిక సైన్యంలో ఎవరూ చనిపోలేదు. అదే సమయంలో బాగ్దాదితో పాటు వేలమంది ఐసిస్ తీవ్రవాదులు హతమయ్యారు.
డొనాల్డ్ ట్రంప్,అమెరికా అధ్యక్షుడు
First published: October 27, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading