హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు సిఫార్సు!

నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు సిఫార్సు!

ట్రంప్ (ఫైల్ ఫొటో)

ట్రంప్ (ఫైల్ ఫొటో)

నోబెల్ శాంతి బహుమతిని తనకు ఇవ్వాలని జపాన్ ప్రధాని షింజో అబే ఆ అవార్డును ఇచ్చే వారికి సిఫార్సు చేశారని...అయితే ఆ అవార్డు తనకు ఎప్పటికీ రాదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

నార్త్ కొరియాతో శాంతిని నెలకొల్పేందుకు చూపుతున్న చొరవకు  నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును జపాన్ ప్రధాని షింజో అబే నామినేట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే తాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అవుతానని భావించడం లేదని శ్వేతసౌధంలో ఆయన మీడియాకు తెలిపారు. తన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు తెలియజేస్తూ జపాన్ ప్రధాని షింజో అబే నుంచి తనకు ఐదు పేజీల లేఖ అందినట్లు వెల్లడించారు. జపాన్ ప్రజల తరఫున తన పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తూ షింజో అబే పంపిన లేఖ కాపీని తనకు పంపారని చెప్పారు.

అయితే తనకు ఎప్పటికీ ఆ అవార్డు దక్కబోదని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాకు ఆ అవార్డును ఇచ్చారని, తనకు ఎందుకు ఆ అవార్డు ఇచ్చారో ఆయనకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రపంచ శాంతి కోసం తాను ఎంతో చేశానని, వేలాది మంది ప్రాణాలను తాను కాపాడినట్లు చెప్పుకొచ్చారు. సిరియాలో తన నిర్ణయాల వల్లే చాలా మంది ఇప్పడు బ్రతికి ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.

నార్త్ కొరియాతో అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో ప్రపంచానికి పెను ముప్పు తప్పినట్లేనని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించుకున్నారు.

First published:

Tags: Donald trump, Nobel Prize

ఉత్తమ కథలు