ట్రంప్-కిమ్ భేటీ ఆ హోటల్‌లోనే...!

కొబ్బరి, తాడి చెట్లతో అందమైన బీచ్‌లు, క్యాసినోలు, లగ్జరీ హోటల్స్, గోల్ఫ్ కోర్సులకు సెంటసా నెలవు. సింగపూర్‌ మెయిన్ ల్యాండ్‌కు దూరంగా ఉండడంతో భద్రతాపరంగా ఇదే ఉత్తమమైన ప్రాంతామని అమెరికా అధికారులు భావిస్తున్నారు. 

Shiva Kumar Addula | news18
Updated: June 8, 2018, 3:26 PM IST
ట్రంప్-కిమ్ భేటీ ఆ హోటల్‌లోనే...!
కొబ్బరి, తాడి చెట్లతో అందమైన బీచ్‌లు, క్యాసినోలు, లగ్జరీ హోటల్స్, గోల్ఫ్ కోర్సులకు సెంటసా నెలవు. సింగపూర్‌ మెయిన్ ల్యాండ్‌కు దూరంగా ఉండడంతో భద్రతాపరంగా ఇదే ఉత్తమమైన ప్రాంతామని అమెరికా అధికారులు భావిస్తున్నారు. 
  • News18
  • Last Updated: June 8, 2018, 3:26 PM IST
  • Share this:
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీపై ప్రపంచ మంతటా ఆసక్తి నెలకొంది. సింగపూర్‌లో జూన్ 12న ఇరుదేశాల సదస్సు జరగబోతోంది. ఐతే ట్రంప్, కిమ్వీ భేటీ కాబోయే వేదికను అమెరికా దౌత్యవేత్తలు ఖరారు చేశారు. ప్రపంచంలో అత్యంత విలాసవంత  హోటల్స్‌లో ఒకటైన క్యాపెల్లా హోటల్‌లో వీరు భేటీ కానున్నారు. సింగపూర్‌లో అతిపెద్ద ద్వీపం, పర్యాటకుల స్వర్గ ధామమైన సెంటొసా ద్వీపంలో ఈ హోటల్ ఉంది.

" సెంటొసా ద్వీపంలోని క్యాపెల్లా హోటల్‌లో ట్రంప్, కిమ్ సమావేశం జరుగుతుంది. సింగపూర్ నిర్వాహకులు ఇస్తున్న అతిథ్యానికి ధన్యవాదాలు." అని వైట్ హౌజ్ సెక్రటరీ సారా శాండర్స్ ట్విటర్‌లో వెల్లడించారు.

ఇరుదేశాల భేటీలో కొరియన్ ద్వీపకల్పాన్నిఅణురహిత రాజ్యంగా మార్చాలన్న అంశంపై ట్రంప్, కిమ్ చర్చించనున్నారు. ఐతే వీరిద్దరికి ఆతిథ్యమిస్తున్న సెంటోసా ద్వీపం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొబ్బరి, తాడి చెట్లతో అందమైన బీచ్‌లు, క్యాసినోలు, లగ్జరీ హోటల్స్, గోల్ఫ్ కోర్సులకు సెంటసా నెలవు. సింగపూర్‌ మెయిన్ ల్యాండ్‌కు దూరంగా ఉండడంతో భద్రతాపరంగా ఇదే ఉత్తమమైన ప్రాంతామని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

గార్డియన్ మీడియా సంస్థ కథనం ప్రకారం..ఈ ద్వీపానికి ఓ చీకటి చరిత్ర కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్, ఆస్ట్రేలియా యుద్ధ ఖైదీలను జపాన్  ఇక్కడే బంధించి పెట్టింది. 1972 సమయంలో ఈ ద్వీపాన్ని ‘ఐలాండ్ ఆఫ్ డెత్ ఫ్రమ్ బిహిండ్’ గా ప్రాచుర్యంలో ఉండేది.  ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం పేరును మార్చి పర్యాటకంగా అభివృద్ధి చేసింది.

ట్రంప్-కిమ్ భేటీ కాబోతున్న క్యాపెల్లా హోటల్‌ని సింగపూర్ భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్పెషల్ సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. ఆ జోన్‌లో ఆయుధాలు, బ్యానర్లు, సౌండ్ సిస్టమ్స్‌పై నిషేధం విధించారు. ఆ ప్రాంతంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్‌లపైనాన నిషేధ విధించారు.

30 ఎకరాల్లో విస్తరించి ఉండే క్యాపెల్లా హోటల్‌లో మొత్తం 112 గదులు ఉంటాయి. విలాసవంతమైన ఈ హోటల్‌లో బేసిక్ రూముల అద్దె  496 డాలర్లు (సుమారు 33 వేలు) . అదే విలాసవంతమైన ట్రిపుల్ బెడ్‌రూం కావాలంటే ఒక్కో రాత్రికి రూ. 5 లక్షలు చెల్లించాల్సిందే. ట్రంప్-కిమ్ భేటీ కోసం హోటల్ మొత్తాన్ని బుక్ చేశారు ఇరుదేశాల అధికారులు.
Published by: Shiva Kumar Addula
First published: June 6, 2018, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading