DONALD TRUMP ACCOUNT REMOVAL MAKES TWITTER LOSES 5 BILLION DOLLARS IN MARKET HSN
Donald Trump -Twitter: డోనాల్డ్ ట్రంప్ ఖాతాపై నిషేధం.. ట్విటర్ కు ఎంత నష్టం వచ్చిందో తెలిస్తే అవాక్కవాల్సిందే..!
డొనాల్డ్ ట్రంప్( ఫైల్ ఫోటో)
ట్రంప్ తన పదవీకాలం పూర్తవడానికంటే ముందే రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. అంతే కాకుండా జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరుకాబోనని ఇప్పటికే ప్రకటించారు. ’ట్రంప్ నా ప్రమాణస్వీకారానికి రాకపోవడమే ఉత్తమం. కనీసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరయినా నేను సంతోషిస్తాను‘ అని బైడెన్ వ్యాఖ్యానించడంతో..
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. జనవరి 20వ తారీఖున అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అదే సమయంలో అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఓటమితో తీవ్ర నిరాశనిస్పృహలతో ఉన్న ట్రంప్, తన అనుచరులను క్యాపిటల్ భవన్ పై దాడికి పాల్పడేలా ప్రోత్సహించడం అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది. దీంతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు నిషేధానికి గురి అవడం తీవ్ర చర్చనీయాంశమయింది. యాక్టివ్ లీడర్లలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న ట్రంప్ ట్విటర్ ఖాతా కూడా బ్యాన్ అవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ట్రంప్ ఖాతాను నిషేధించడంతో ట్విటర్ పై బాగానే ప్రభావం పడింది. ఆయన ఖాతాను నిలిపివేయడం వల్ల ఏకంగా 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏకంగా 36వేల కోట్ల రూపాయలను ట్విటర్ సంస్థ నష్టపోయింది. అదే సమయంలో ట్విటర్ షేర్ 12శాతం కుప్పకూలింది. ట్రంప్ కు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో ట్రంప్ మద్ధతుదారులకు చెందిన 70 వేల అకౌంట్లను ట్విటర్ రద్దు చేసింది. దీంతో ఈ మేరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ సంస్థ కూడా ట్రంప్ అధికారిక ఖాతాను మూసేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా, ట్రంప్ తన పదవీకాలం పూర్తవడానికంటే ముందే రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. అంతే కాకుండా జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరుకాబోనని ఇప్పటికే ప్రకటించారు. ’ట్రంప్ నా ప్రమాణస్వీకారానికి రాకపోవడమే ఉత్తమం. కనీసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరయినా నేను సంతోషిస్తాను‘ అని బైడెన్ వ్యాఖ్యానించడంతో, మైక్ పెన్స్ స్పందించారు. తాను బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను పూర్తి చేయడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అమెరికా కాంగ్రెస్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ఆయనపై నిషేధం విధించాలని ఆలోచిస్తోంది.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.