news18-telugu
Updated: November 18, 2020, 12:06 PM IST
ఆటలతో టైమ్ పాస్ చేస్తున్న ట్రంప్ (credit - twitter - reuters)
Donald Trump after Defeat: 2 వారాల కిందట అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రస్తుతం ఏం చేస్తున్నారన్నది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. అధికారిక కార్యక్రమాలపై ఏమాత్రం ఆసక్తి చూపని ట్రంప్ జస్ట్ అలా టైం పాస్ (timepass) చేస్తున్నట్టు CNN వెల్లడించింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అయినప్పటికీ సీరియస్‌గా ఏ అధికారిక కార్యక్రమాలూ చేయని ట్రంప్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో (public events) సైతం కనిపించని ట్రంప్ ఓ సామాన్యుడిలా తనకు తోచింది చేసుకుంటూ పోతున్నారు. వర్జీనియాలోని తన సొంత క్లబ్లో 2 వీకెండ్స్‌లో 2 సార్లు ట్రంప్... గోల్ఫ్ ఆడారని అమెరికన్ మీడియా తెలిపింది. అధ్యక్షుడిగా ఉన్న మొత్తం సమయంలో 283 రోజులు ట్రంప్ ఇక్కడ గోల్ఫ్ ఆడారని అధికారిక సమాచారం చెబుతోంది. జో బైడెన్ అధ్యక్షుడిగా గెలిచిన రోజు కూడా ట్రంప్ ఇక్కడి గోల్ఫ్ కోర్సులోనే ఉన్నారు.
వివాదాస్పద నిర్ణయాలు:ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై సైనిక దాడికి ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్టు పెంటగాన్ (Pentagon) లోని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం నుంచి వార్తలు వచ్చాయి. తాను పదవి నుంచి దిగే లోగా ఇరాన్‌పై అణ్వాయుధ దాడిచేసే అవకాశాలను పరిశీలించాలని ట్రంప్ తన సలహాదారులను ఆదేశించారని కూడా వెలుగులోకి రావడం అత్యంత వివాదాస్పదంగా మారంది. మరోవైపు ఎన్నికల్లో గెలిచింది నేనే అంటూ ట్వీట్ చేయడంతో తాజాగా తన మానసిక స్థితి సరిగా లేదని తనకు తానే ట్రంప్ ప్రకటించుకున్నట్లైంది. ఇలా వీవాదాస్పద ట్వీట్లు చేయడం కూడా ట్రంప్‌కు రొటీన్‌గా మారింది. చాలాసార్లు ఆయన ట్వీట్లను ట్విట్టర్... ఖండించాల్సి వచ్చింది.
ఉద్యోగులను తీసేయడం:
ఎన్నికలు ముగిసిన వెంటనే రక్షణశాఖా మంత్రి మార్క్ ఎస్పర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్... ప్రస్తుతం ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నారు. రక్షణ శాఖతోపాటు సాధారణ పరిపాలనలోని ఉద్యోగులను ఒక్కొక్కరుగా ట్రంప్ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. CIA డైరెక్టర్ గినా హాస్పెల్ను కూడా ఊస్ట్ చేసే పనిలో ట్రంప్ ఉన్నట్టు లీకులు వచ్చాయి. FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రేను తొలగించే యోచనలో ఉన్నట్టు ట్రంప్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.
పదవే కావాలా బాధ్యత వద్దా:
ఓటమిపాలైన ట్రంప్ తన విధులు నిర్వహించడంపై ఏమాత్రం శ్రద్ధాసక్తులు చూపకపోగా, తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక విషయాలపై కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోవిడ్ టీకా (covid vaccine) అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ట్రంప్ ఇప్పుడు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. పైగా కోవిడ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ చితికిపోయినా కనీసం దాన్ని సరిచేసే చర్యలు చేపట్టట్లేదు. ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. స్వయంగా వైట్ హౌస్ ఉద్యోగులకు కూడా ఆయన నచ్చట్లేదు.
ఇది కూడా చదవండి: Road with Human Bones: మనుషుల ఎముకలతో రోడ్డు నిర్మాణం... ఎక్కడో తెలుసా?
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ తన ప్రవర్తనపై విమర్శలు వస్తున్నా కేర్ చేయట్లేదు. అధికారిక కార్యక్రమాల్ని పట్టించుకోవట్లేదు. వైట్‌హౌజ్‌లో అత్యధిక ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం అక్కడి కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది. ట్రంప్ తీరు చూస్తుంటే మాత్రం 2024 అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీపడేలా ఉన్నారనే ఛలోక్తులు జోరుగా వినిపిస్తున్నాయి. జీవితకాలంపాటు అధ్యక్షుడిగా కొనసాగేలా ఆయన పగటి కలలు కంటున్నట్టు అమెరికన్ మీడియా సెటైర్లు వేస్తోంది. 2021 జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఇక ట్రంప్ సమస్య అమెరికన్లకు ఉండదు.
Published by:
Krishna Kumar N
First published:
November 18, 2020, 12:06 PM IST