హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump : నీ యవ్వ తగ్గేదే లే..ట్రంప్ సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ ఇదే

Donald Trump : నీ యవ్వ తగ్గేదే లే..ట్రంప్ సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ ఇదే

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

Trump Social Media :

Truth Social Platform :  గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఆ సయమంలో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే గతేడాది అక్టోబర్‌లో సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు. "ట్రూత్​ సోషల్"​ పేరుతో సోషల్ మీడియా యా‌ప్‌ ను తీసుకొస్తున్నట్టు తెలిపారు.

ట్రంప్ సొంతంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా "ట్రూత్ సోషల్" మరికొద్ది రోజుల్లో జనం ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 21న ఈ యాప్ లాంచింగ్ ఉంటుందని సమాచారం. ఇది ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌పై అందుబాటులో ఉంది. అయితే సొంత సోషల్ ఫ్లాట్ ఫాం "ట్రూత్​ సోషల్"​ లో ట్రంప్ పోస్ట్ చేసిన తొలి సందేశం ఇదేనంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ ను ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మంగళవారం రాత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. "గెట్ రెడీ, మీకు ఇష్టమైన అధ్యక్షుడు మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు" అని ఆ స్క్రీన్ షాట్ లో ఉంది.

ALSO READ New Helmt Rule : కొత్త హెల్మెట్ రూల్ వచ్చేసింది..తెలుసుకోకుంటే భారీ జరిమానా కట్టాలి మరి

కాగా,ది ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ (టీఎంటీజీ) ఆధ్వర్యంలో ట్రూత్‌ సోషల్‌ యాప్ వస్తోంది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌ లోనూ ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌కి సంబంధించిన నమూనా ఫొటోలు ఇప్పటికే బయటికొచ్చాయి. సాధారణంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసేవాటిని ట్వీట్‌ అంటాం. అదేవిధంగా, ట్రూత్‌ సోషల్ మీడియా యాప్‌ లో మాత్రం 'ట్రూత్‌' అని సంబోధిస్తారు. తాను తీసుకువస్తున్న ఈ సామాజిక మాధ్యమ వేదిక టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌ లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో, అందరికీ గొంతునివ్వడం కోసం ట్రూత్ సోషల్‌ను అభివృద్ధిపరచినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొదటి ట్రూత్‌ను ట్రూత్ సోషల్‌లో ఇవ్వడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Donald trump, Social Media, USA

ఉత్తమ కథలు