కరీబియన్ దీవుల్లో గురువారం ఘోర విమాన ప్రమాదం (Dominican republic plane crash) జరిగింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ప్రముఖ లాటిన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫ్లోలా మూవీ (Puerto Rican music producer Flow La Movie), ఆయన భార్య, కుమారుడితో పాటు మరో ఆరుగురు మరణించారు. విమాన ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించినట్లు డొమినికన్ రిపబ్లిక్ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ది గల్ఫ్‌స్ట్రీమ్ GIVSPగా గుర్తించారు. అందులో ఇద్దరు విమాన సిబ్బందితో పాటు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒకరు డొమికన్ జాతీయుడు కాగా.. మిగతా వారంతా విదేశీయులే ఉన్నారని విమాన యాజమాన్య సంస్థ హెలిడోస ఏవియేషన్ గ్రూప్ వెల్లడించింది. విమానంలో ఉన్న ప్రయాణికులంతా మరణించారని తెలిపింది.
Omicron: 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు.. వ్యాప్తి వేగంగా ఉంది: డబ్ల్యూహెచ్ఓ
Comunicado - Miércoles 15 de dic. de 2021 pic.twitter.com/jm1O9b98gr
— Helidosa Aviation Group (@Helidosa) December 16, 2021
లాస్ అమెరికాస్ ఎయిర్ పోర్టు సమీపంలో నుంచి దట్టమైన పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదంలో విమానం ముక్కలయిపోయింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.
ఖగోళ చరిత్రలో అద్బుతం: తొలిసారి సూర్యుడిని తాకిన NASA స్పేస్‌క్రాఫ్ట్.. Parker తీసిన ఫొటో
Nine dead in Dominican Republic plane crash, reports AFP News Agency quoting the airline pic.twitter.com/aXcbJTafWF
— Journalist Siraj Noorani (@sirajnoorani) December 16, 2021
విమానం డొమినికన్ రిపబ్లిక్ నుంచి అమెరికలోని మయామీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ జరగనున్న ఓ ఈవెంట్లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫ్లోలా మూవీ ఫ్యామిలీ పాల్గొనాల్సి ఉంది. విమానం బయలుదేరిన 15 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తెలెత్తింది. పైలట్లు అప్రమత్తమై లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. ల్యాండ్ అయ్యే లోపే విమానం కుప్పకూలి..భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారంతా మరణించారు. ఘటనపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Plane Crash